బాలీవుడ్ లో అత్యధికంగా ట్రోలవుతున్న స్టార్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు అక్షయ్ కుమార్. జాతీయ అవార్డు గెల్చుకున్న ఆకాశం నీ హద్దురా రీమేక్ తోనూ డిజాస్టర్ కొట్టడం ఆయనకే చెల్లింది. ఒరిజినల్ వెర్షన్ నిర్మాత, దర్శకురాలు అండదండలు అందించినా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పోయింది. ఇదే కాదు గత చిత్రం బడేమియా చోటేమియా ఘోరాతి ఘోరంగా దెబ్బ కొట్టింది. ఇంకా వెనక్కు వెళ్లి లిస్టు చూసుకుంటే సుమారు పదిహేనుకి పైగా సూపర్ ఫ్లాప్స్ కేవలం మూడేళ్ళ కాలంలో ఇచ్చాడు. ఎంత వేగంగా సినిమాలు చేస్తాడో అంతకన్నా వేగంగా థియేటర్ల నుంచి మాయమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఈయన కొత్త మూవీ ఖేల్ ఖేల్ మే ఆగస్ట్ 15 విడుదల కాబోతోంది. తాప్సి ఒక హీరోయిన్ గా నటించింది. క్యాస్టింగ్ గట్రా ఆసక్తికరంగా ఉంది. అనఫీషియల్ గా ఇది మోహన్ లాల్ 12త్ మ్యాన్ రీమేకనే ప్రచారం ముంబై వర్గాల్లో జోరుగా ఉంది. ఇవాళ జరిగిన ట్రైలర్ లాంచ్ లో తన సెలక్షన్ మీద వస్తున్న విమర్శల గురించి అక్షయ్ కుమార్ ఘాటుగా స్పందించాడు. తాను చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నానని, సంపాదించిన ప్రతి రూపాయి తన కష్టమే తప్ప దోచుకున్నది కాదని చెప్పుకొచ్చాడు. నిజానికి అడిగిన క్వశ్చన్ కు నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా అనడం ఆశ్చర్యపరిచింది.
రీమేకుల వ్యామోహంలో పడ్డ అక్షయ్ కుమార్ నిజంగా తాను ఎక్కడ తప్పులు చేస్తున్నాడో గుర్తించడం లేదు. తమిళ తెలుగు మలయాళంలో హిట్ అయిన సబ్జెక్టుని ఎవరైనా పట్టుకొస్తే చాలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పుడీ ఖేల్ ఖేల్ మే మీద కూడా ఏమంత బజ్ లేదు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఇలాగే కొనసాగితే అక్షయ్ ని నమ్మకం మానేయాల్సి వస్తుందని వాపోతున్నారు. షారుఖ్ ఖాన్ లాగా స్వీయ విశ్లేషణ చేసుకుని బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ అవ్వాలని అంతే తప్ప ఇలా నా కష్టం నా ఇష్టం అంటూ డైలాగులు చెప్పడం మానేయాలని కోరుతున్నారు. వినే పరిస్థితిలో అయన ఉంటేగా.
This post was last modified on August 2, 2024 5:15 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…