Movie News

రేసులో దూసుకుపోతున్న బచ్చన్


ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్లు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. రకరకాల ఈవెంట్లలో పాల్గొనడమే కాక.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీంలోని ఇతర సభ్యులు కూడా వీలైనంత మేర ప్రమోషన్లు చేస్తున్నారు. ఇవి ఎంత ఉత్సాహభరితంగా సాగితే.. సినిమా అంతగా జనాలకు రీచ్ అవుతుంది. అందులోనూ పోటీ ఎక్కువగా ఉన్న టైంలో రిలీజయ్యే చిత్రాలకు ప్రమోషన్లు ఇంకాస్త ఎక్కువే అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజ్ కాబోతున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను టీం భలేగా ప్రమోట్ చేస్తోంది.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు సోషల్ మీడియాను ఊపేశాయి. సితార్ సాంగ్ రిలీజైనపుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను అందులో ఎలా చూపించారనేదాని మీద పెద్ద చర్చ జరిగింది. రెండో పాటలోనూ హీరోయినే హైలైట్ అయింది.

ఇక ఇటీవలే టీజర్ లాంచ్ చేస్తూ హరీష్ శంకర్ అండ్ కో పెట్టిన ప్రెస్ మీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత హరీష్ శంకర్ ఇంటర్వ్యూలతో సెగలు రేపడం మొదలుపెట్టాడు. ఇంకోపక్క హీరోయిన్ అందాలను హైలైట్ చేస్తూ ఎప్పటికప్పుడు పోస్టర్లు వదులుతూనే ఉన్నారు.

ఇప్పుడేమో రవితేజ రంగంలోకి దిగాడు. ఆయన వాయిస్‌తో మెట్రో ట్రైన్లో వదిలిన యాడ్ భలే క్లిక్ అయింది. మీకు ఇక్కడ సీట్ దొరక్కపోయినా ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ థియేటర్లో మత్రం సీట్ గ్యారెంటీ అంటూ ఇంటరాక్టివ్‌గా చేసిన ఈ యాడ్ బాగా పేలింది. త్వరలోనే రవితేజ మీడియా ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనబోతున్నాడు. హీరోయిన్ని కూడా మీడియా ముందుకు తీసుకొస్తారట. టీం అంతా కూడా కలిసి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వబోతోందట. మొత్తంగా ప్రమోషన్లలో ‘మిస్టర్ బచ్చన్’ ఊపు మామూలుగా లేదు. ఆగస్టు 15కు రానున్న మిగతా చిత్రాలు మాత్రం ఈ పోటీలో కొంచెం వెనుకబడే ఉన్నాయి.

This post was last modified on August 2, 2024 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉపేంద్ర చూపించేది సినిమానా? పరీక్షనా??

సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. 'ఏ'తో దాన్ని ముప్పై…

1 hour ago

మస్క్ నుండి కొత్త బాంబ్ !

ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…

3 hours ago

ధోనీ జీతం కన్నా గుకేశ్ కట్టే ట్యాక్సే ఎక్కువ?

భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్‌ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…

3 hours ago

ఫ్యామిలీ మ్యాన్ రొమాన్స్…. మనోజ్ భాయ్ ట్రెండింగ్!

బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…

3 hours ago

బచ్చలమల్లి: అల్లరోడికి అడ్వాంటేజ్!

క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…

4 hours ago