టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌కు సంబంధించి ఓ వ్యక్తిగత వివాదం కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లావణ్య చౌదరి అనే అమ్మాయి రాజ్‌తో తనతో చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడని.. తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. కానీ ఇప్పుడు తనను వదిలేసి తన కోస్టార్ అయిన మాల్వి చౌదరితో తిరుగుతున్నాడని ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి. వ్యవహారం కోర్టు వరకు వెళ్లేలా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం విడుదలవుతున్న తన కొత్త చిత్రం ‘తిరగబడరా సామీ’ ప్రమోషన్లకు వచ్చినపుడు కూడా మీడియా నుంచి ఈ విషయమై రాజ్ చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో రాజ్‌ను కలవడానికి లావణ్య ప్రయత్నించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే రాజ్‌కు మద్దతుగా మీడియా ఛానెళ్లలో మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ భాషాను లావణ్య లైవ్‌లో చెప్పుతో కొట్టడం సంచలనం రేపింది. శేఖర్ భాషా కొన్ని వారాల నుంచి పలు ఛానెళ్లలో రాజ్‌కు మద్దతుగా వాయిస్ వినిపిస్తున్నాడు. అతను లావణ్య మీదే పలు ఆరోపణలు చేస్తున్నాడు. ఒక టీవీ ఛానెల్ చర్చ జరుగుతుండగా అతను మధ్యలో లేచి పారిపోయిన వీడియో కొన్ని రోజుల కిందట వైరల్ అయింది. కాగా ఇప్పుడు లావణ్యతో కలిసి ఒక టీవీ ఛానెల్లో చర్చలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా లావణ్య డ్రగ్ అడిక్ట్ అని ఆరోపిస్తూ.. ఆమె పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తోందన్నట్లుగా ఏదో మాట్లాడాడు. కొంతసేపు ఓపిగ్గా తనను కౌంటర్ చేసిన లావణ్య.. ఉన్నట్లుండి తన చెప్పు తీసి అతడి మీదికి విసిరేసింది. దీంతో ఈ చర్చలో పాల్గొన్న న్యూస్ ప్రెజెంటర్, ఇతరులు అవాక్కయ్యారు. ఈ ఘటన గతంలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు.. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని లైవ్‌లో చెప్పుతో కొట్టిన ఉదంతాన్ని గుర్తు చేస్తోంది అందరికీ.
This post was last modified on August 2, 2024 2:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…