తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ పుణ్యమాని రన్బీర్ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకూ సుపరిచితుడుగా మారాడు. అంతకు ముందు బ్రహ్మాస్త్ర బాగానే ఆడినా ఇప్పుడంత కిక్ అయితే కాదు. నిజ జీవిత ప్రియురాలు అలియా భట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రన్బీర్ ఇటీవలే తమ లవ్ స్టోరీకి సంబంధించి కొన్ని షాకింగ్ ముచ్చట్లు పంచుకున్నాడు. ఇతను మొదటిసారి అలియాని కలుసుకున్నప్పుడు ఆమె వయసు 9 సంవత్సరాలు. మనోడికేమో 20 నిండింది. అంటే ఇద్దరి మధ్య పదకొండేళ్ల గ్యాప్ ఉందన్న మాట. ఫస్ట్ కలయిక కూడా విచిత్రంగా జరిగింది.
సంజయ్ లీలా భన్సాలీ బాలిక వధూ పేరుతో ఒక సినిమా తీసే ప్లాన్ లో ఉండగా పెద్దబ్బాయి, చిన్న పాప కోసం వెతుకుతున్నప్పడు రన్బీర్, అలియాలు ఆడిషన్ కు వచ్చారు. బాల్య వివాహాల మీద సీరియస్ గా ప్లాన్ చేసిన డ్రామా అది. అప్పుడే మొదటిసారి వీళ్ళ మీటింగ్ జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు తెరకెక్కకుండానే ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ స్టార్లు అయిపోవడం, లవ్ లో పడటం చకచకా జరిగాయి. ఇదంతా ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్న రన్బీర్ కపూర్ ఈ సంగతులు చెప్పడం ద్వారా ఆశ్చర్యానికి గురి చేసింది.
కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం రన్బీర్ కపూర్ అబద్దం చెబుతున్నాడని, గతంలో తమ తొలి కలయిక గురించి వేరే స్టోరీ చెప్పి ఇప్పుడు కొత్త కహాని వినిపిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. దానికి ఆధారంగా వీడియో ఇంటర్వ్యూల క్లిప్ లు బయటికి తీస్తున్నారు. అయినా వయసు వ్యత్యాసం పెద్ద మ్యాటర్ కాదు కానీ సెలబ్రిటీల విషయంలో జరిగినప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మాములుగా అయిదు లేదా మహా అంటే ఏడేళ్ల గ్యాప్ భార్యాభర్తల మధ్య ఉండటం సహజం కానీ మరీ పదకొండేళ్లు అంటే అనూహ్యమే. ఈ ఇద్దరూ కలిసి నటించబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది.
This post was last modified on August 2, 2024 9:22 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…