సినీ తారలను ట్రోలింగ్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్ ని లక్ష్యంగా పెట్టుకుని మంచు విష్ణు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నే ఇస్తున్నాయి. కొన్ని ఇప్పటికే బ్లాక్ అయిపోగా మరికొన్నింటిని ఆ లిస్టులో చేర్చే దిశగా సైబర్ క్రైమ్ విచారణ వేగవంతం చేసింది.
అయితే దీనికి నిరసనగా కొందరు యుట్యూబర్లు రివర్స్ లో విష్ణునే టార్గెట్ చేసుకుని పలు వీడియోలు చేయడం ట్విట్టర్ లో వైరలవుతోంది. తమది కానీ మెయిల్ ఐడి నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే సంబంధం లేదని విష్ణు టీమ్ చెప్పినా కొందరు అదే పని చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇదిలా ఉండగా ఫేక్ ఛానల్స్ మీద మంచు విష్ణు చేస్తున్న యుద్ధానికి కోలీవుడ్ నుంచి మద్దతు దక్కుతోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ మీనా ఇలా చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శరత్ కుమార్, రాధికలు దీని గురించి గళం విప్పారు.
అడ్డు అదుపు లేకుండా పోతున్న కొందరు యూట్యూబర్స్ మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, తలుచుకుంటే ఒక్క రాత్రిలో చేసేయొచ్చని అన్నారు. మీనా భర్త చనిపోయాక ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోంది దారుణంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
నిజమే మరి. ఆరోగ్యకరంగా అందరూ ఆమోదించేలా ట్రోల్స్ చేస్తే ఓకే కానీ ఇలా తప్పుడు సమాచారం ఇస్తూ స్టార్ల మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదే బ్యాచ్ మంచు విష్ణునే కాదు ఆచార్య, భోళా శంకర్ టైంలో చిరంజీవి మీద కూడా ట్రోల్ చేయడానికి వెనుకాడలేదు.
ఇటీవలే పోలీస్ ఉన్నతాధికారులను కలిసిన మా అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు చెప్పి ఇకపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఏది ఏమైనా డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని యుట్యూబ్ ఛానల్స్ కి అడ్డుకట్ట వేయాలంటే ఇంకా బలమైన పరిష్కారాలు తప్పవు.
This post was last modified on August 1, 2024 8:40 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…