స్టార్‌గా ముద్ర వేసుకున్నాక బోలెడన్ని అవకాశాలు వస్తాయి. అందులోంచి నచ్చిన పాత్రను ఎంచుకోవచ్చు. ఏదైనా పాత్ర మిస్ అయినా పెద్దగా ఫీలయ్యేది ఉండదు. కానీ కెరీర్ ఆరంభంలో ఏదైనా పాత్ర కోసం ముందు ఎంచుకుని, తర్వాత పక్కన పెడితే చాలా బాధ పడతారు ఆర్టిస్టులు. ఐతే మేకర్స్ ఇలా వేర ఆప్షన్ తీసుకున్నపుడు ఏం చేస్తాంలే అని బాధ పడి ఊరుకుంటారు ఎవరైనా. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం అలా ఎలా చేస్తారంటూ గొడవ పడి మరీ ఒక పాత్రను లాక్కుందంట.
‘పూజా మేరీ జాన్’ అనే సినిమా విషయంలో ఇలా జరిగినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది మృణాల్. ఇది మృణాల్ కెరీర్లో లాంగ్ డిలేయ్డ్ మూవీ. ఈ సినిమా పనులు చాలా ఏళ్ల కిందట మొదలయ్యాయి. రెండేళ్ల కిందటే దీని చిత్రీకరణ పూర్తయింది. విడుదల మాత్రం ఆలస్యం అవుతోంది.
ఈ ఏడాది చివర్లో ‘పూజా మేరీ జాన్’ రిలీజ్ కావచ్చని చెప్పిన మృణాల్.. ఇందులో ప్రధాన పాత్ర కోసం తాను నిర్మాతలతో గొడవ పడ్డ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. “పూజా మేరీ జాన్ కోసం ముందు నన్నే సంప్రదించారు. చాలాసార్లు ఆడిషన్ జరిగింది. నా కెరీర్లో అన్నిసార్లు ఆడిషన్ చేసిన సినిమా ఇంకోటి లేదు. ఆ పాత్రతో నేను ఎమోషనల్‌గా బాగా కనెక్టయ్యాను. ఐతే ముందు నాకు ఆఫర్ చేసిన పాత్రకు మరొకరిని ఎంచుకున్నారని తర్వాత తెలిసింది. నేను నిర్మాతలతో ఈ విషయమై గొడవ పడ్డాను. ఈ పాత్ర నాకే కావాలని అడుక్కున్నాను. చివరికి ఆ క్యారెక్టర్ నేనే చేశాను. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఈ ఏడాదే రిలీజవుతుందని అనుకుంటున్నా” అని మృణాల్ తెలిపింది.
ఇటీవలే ‘కల్కి’లో క్యామియో రోల్‌లో మెరిసిన మృణాల్.. ప్రస్తుతం ‘విశ్వంభర’లో చిరుకు జోడీగా నటిస్తోంది. ఆమె చేతిలో మరికొన్ని హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి.
This post was last modified on August 1, 2024 12:51 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…