జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ దాని విడుదల ముందో పరీక్ష రాస్తోంది. అదే ఉలజ్. రేపు విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ ఆమె భుజాల మీదే మార్కెటింగ్ జరుపుకుంటోంది. రోషన్ మ్యాత్యు, గుల్షన్ దేవయ్య లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ ప్రేక్షకులకు అంతగా రిజిస్టరైన బాపతు కాదు. ఒక్క జాన్వీని మాత్రమే అధిక శాతం గుర్తు పడతారు. సుధాన్షు సారియా దర్శకత్వం వహించిన ఉలజ్ వాస్తవానికి జూలైలోనే రావాల్సింది. కానీ కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించి జాగ్రత్త పడి రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది.
దీన్ని దేవర ముందు టెస్టని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27 దాకా జాన్వీ కపూర్ వేరే రిలీజులు ఏమీ లేవు. ప్రస్తుతం ఆమె తారక్ షూటింగ్ లోనే బిజీగా ఉంది. ఉలజ్ కనక పెద్ద హిట్ అయితే మార్కెట్ పెరుగుతుందని తండ్రి జాన్వీ కపూర్ ఆశాభావంతో ఉన్నాడు. అది నార్త్ మార్కెట్ తో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది. పైగా సోలోగా జాన్వీ కపూర్ నటించిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. మంచి కథలు ఎంచుకుంటుందని పేరు తెచ్చుకుంటోంది కానీ కమర్షియల్ గా అవేవి అద్భుతాలు చేయలేకపోయాయి.
అందుకే ఆశలన్నీ ఉలజ్ మీదే ఉన్నాయి. దేవర ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది తారక్, కొరటాల శివ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ 16కి డేట్లు ఇవ్వాలి. చరణ్ మేకోవర్ పూర్తయితే తప్ప దర్శకుడు బుచ్చిబాబు షెడ్యూల్స్ ప్లాన్ చేయలేడు. ముందు జాగ్రత్తగా అధిక శాతం కాల్ షీట్లు ఈ రెండు సినిమాలకే ఇచ్చేలా జాన్వీ కపూర్ చూసుకుంటోందట. ఇవి కనక హిట్ అయితే టాలీవుడ్ లో భారీ స్వాగతంతో పాటు స్టార్ హీరోల సరసన అవకాశాలు క్యూ కడతాయి. అదే జరిగితే బాలీవుడ్ టాప్ లీగ్ లో లేనన్న లోటు తీరిపోతుంది.
This post was last modified on August 1, 2024 12:30 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…