తెలుగు ప్రేక్షకుల సినీ అభిమానం గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించేలా అక్కడ పరిస్థితులు ఉన్నాయా అంటే ఔనని సమాధానం చెప్పలేం. టికెట్ల ధరలు మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ. పైగా పెద్ద సినిమాలకు అదనపు రేట్లు పెడతారు. మల్టీప్లెక్సుల్లో తినుబండారాల ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఈ స్నాక్స్ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు కానీ… టికెట్ల ధరల గురించి మాత్రం ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాల్సిందే.
రేట్లు అందుబాటులో ఉంటే థియేటర్లకు జనం పెద్ద ఎత్తున వస్తారు. తద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. రేట్లు ఎక్కువైతే ఆటోమేటిగ్గా ఆక్యుపెన్సీలు తగ్గుతాయి. ఇదే విషయాన్ని యువ కథానాయకుడు అల్లు శిరీష్ తన కొత్త చిత్రం బడ్డీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
బడ్డీ మూవీకి సింగిల్ స్క్రీన్లలో రూ.99, మల్టీప్లెక్సుల్లో 125 రేటు పెట్టారు. కొన్ని థియేటర్లు మినహా చాలా వరకు ఈ రేటును అమలు చేస్తున్నాయి. తాము రేట్లు తగ్గించడం గురించి శిరీష్ మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవాళ్లు దేశంలో 90 కోట్ల మంది ఉన్నా.. వారిలో థియేటర్లకు వచ్చేది 3-4 కోట్ల మందే అని.. కానీ తెలుగువాళ్లు 10 కోట్లమంది ఉంటే అందులో 3కోట్ల మంది థియేటర్లకు వస్తారని శిరీష్ చెప్పాడు. ఇంతటి సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులకు ప్రోత్సాహాన్నిచ్చేలా టికెట్ల ధరలు ఉండాలని అతను అభిప్రాయపడ్డాడు.
రేట్లు పెంచితే బంగారు బాతును కోసేసినట్లే అవుతుందని.. అందుబాటులో టికెట్ల ధరలు ఉంటే ఎక్కువ మంది థియేటర్లకు వస్తారని.. ఈ ఆలోచనతోనే తాము రేట్లు తగ్గించామని.. ఇండస్ట్రీలో మిగతా వాళ్లు కూడా దీన్ని అనుసరిస్తారని ఆశిస్తున్నానని శిరీష్ చెప్పాడు. శిరీష్ సూచన పట్ల జనాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరి ఈ మంచి సూచనను ఇండస్ట్రీ జనాలు ఏమేర పాటిస్తారో చూడాలి.
This post was last modified on August 1, 2024 12:27 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…