ఇటీవలే భారతీయుడు 2తో అల్ట్రా డిజాస్టర్ అందుకున్న కమల్ హాసన్ దాని దెబ్బకు కెరీర్ లో మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ ని చవి చూడాల్సి వచ్చింది. తాజాగా వీడియో సాంగ్స్ వచ్చాక ఇది మరింత ఎక్కువయ్యింది.
ఇంతకన్నా దారుణమైన విశ్వరూపం 2, ఉత్తమ విలన్ లాంటివి వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి బ్రతికిపోయారు కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు. ఎంత అత్యద్భుమైన నటుడైనా సరే తీసికట్టు కంటెంట్ తో వచ్చినప్పుడు బాక్సాఫీస్ పరాభవం తప్పదని లాల్ సలామ్ రజనీకాంత్ తర్వాత ఇండియన్ 2 తో కమల్ హాసన్ ఇద్దరూ నేర్చుకున్నారు,
ఇప్పుడు కమల్ హాసన్ నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తుందనే దాని గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ ని 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే దిశగా ఆలోచన జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. దీనికి మాత్రం ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అఫ్కోర్స్ బయ్యర్ల నుంచి కూడా.
ఎందుకంటే అదే పండక్కు చిరంజీవి విశ్వంభర, వెంకటేష్ – అనిల్ రావిపూడి, రవితేజ – భాను భోగవరపు సినిమాలు ఆల్రెడీ అధికారికంగా కర్చీఫ్ వేసుకున్నాయి. తమిళం నుంచి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా రేసులో ఉంది. వీటికే థియేటర్లు సర్దడం పెద్ద సవాల్.
అలాంటిది మధ్యలో తగ్ లైఫ్ వస్తే ఖచ్చితంగా నలిగిపోతుంది. ఎందుకంటే ఇండియన్ 2 తర్వాత సినిమాగా దీని మీద విపరీతమైన బజ్ వస్తుందని చెప్పలేం. ఖచ్చితంగా దాని ప్రభావమైతే ఉంటుంది.
తమిళంలో అజిత్ ని తట్టుకుని నిలబడవచ్చేమో కానీ తెలుగులో మాత్రం కాంపిటీషన్ లో ఎదురీదడం కష్టం. ఈ కారణంగానే మొన్న జనవరిలో ధనుష్, శివ కార్తికేయన్ లు థియేటర్లు లేవని డబ్బింగ్ వెర్షన్లు మాత్రమే వాయిదా వేసుకున్నారు. తగ్ లైఫ్ కు ఆ పరిస్థితి వస్తే బాగుండదు. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ప్రాధమికంగా అనుకున్నారట. భారతీయుడు 3 దర్శనం మాత్రం వేసవిలోనే.
This post was last modified on July 31, 2024 10:16 pm
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…