Movie News

గేమ్ ఖచ్చితంగా ఛేంజ్ కావాల్సిందే

క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ వస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పేశాక చాలా టైం ఉందని మెగా ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వడం లేదు. మహా అయితే నాలుగున్నర నెలల్లో ఆ తేదీ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు ఒక ప్రణాళిక ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు.

కానీ ఎస్విసి టీమ్ చేస్తున్న పబ్లిసిటీ గేమ్ ఎలాంటి కిక్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇవాళ హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ వదిలారు. పాత్ర పేరుని రివీల్ చేస్తూ ఏదైనా కొత్త గెటప్ లో చరణ్ పక్కన జోడిగా చూపిస్తారని ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారు. తీరా చూస్తే జరగండి పాట స్టిల్ రిపీటయ్యింది.

ఇప్పటిదాకా ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి వచ్చిన పబ్లిసిటీ కంటెంట్ ఒక్క జరగండి పాట, దాని స్టిల్స్ మాత్రమే. లీకైన ఫోటోలు వీడియోల ద్వారానే వేరేవి ఎక్కువ చూశామని, కానీ ఇలా అఫీషియల్ హ్యాండిల్స్ లో పదే పదే ఒకే సాంగ్ నుంచి పోస్టర్లు వదలడం పట్ల అభిమానులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ టాకీ పార్ట్ పూర్తవ్వడంతో ప్రస్తుతం ఇతర ఆర్టిస్టులతో బ్యాలన్స్ భాగాన్ని తీసే పనిలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. ఇది ఆఖరి షెడ్యూల్. కాగానే చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేస్తారు. తమన్ రీ రికార్డింగ్ కి ఇవ్వడానికి ఫస్ట్ కాపీ సిద్ధం కావాలి. .

చూసేందుకు డిసెంబర్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక ప్యాన్ ఇండియా సినిమాకు ఇప్పటి నుంచే బజ్ పెంచే విధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉండటం వల్ల సాధారణ ప్రేక్షకుల్లో దీని పట్ల విపరీతమైన అంచనాలు లేవు.

నటించినవాళ్లు, పనిచేసినవాళ్ళు ఇంటర్వ్యూలలో ఓ రేంజ్ ఎలివేషన్లు ఇవ్వడం తప్ప చరణ్ పోషించిన అప్పన్న, రామ్ నందన్ క్యారెక్టర్లను సైతం ఇప్పటిదాకా పరిచయం చేయలేదు. శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఏదైనా బయటికొచ్చేంత స్ట్రిక్ట్ గా ప్లానింగ్ జరుగుతోంది మరి.

This post was last modified on July 31, 2024 3:25 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

3 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

4 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

4 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

4 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

6 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

7 hours ago