సినిమా కోసం కలిసి పని చేస్తున్న సమయంలో కొందరికి ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. హీరో హీరోయిన్లు కూడా మంచి ఫ్రెండ్స్‌గా మారుతుంటారు. ఓ హీరో కుటుంబ సభ్యులతో హీరోయిన్ అసోసియేట్ కావడం చూస్తుంటాం. కీర్తి సురేష్ కూడా ఇలాగే నాని ఫ్యామిలీతో అనుబంధం ఏర్పరుచుకున్న విషయం వెల్లడైంది.
తమిళంలో తన కొత్త చిత్రం ‘రఘు తాత’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె నాని కుటుంబంతో, ముఖ్యంగా తన కొడుకు అర్జున్ (జున్ను)తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. అర్జున్.. కీర్తిని అత్త అని పిలుస్తాడట. తన చిన్న తనం నుంచి చాలా క్లోజ్ అని.. తన స్ట్రెస్ బస్టర్ అర్జున్ అని కీర్తి ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
తన కెరీర్ ఆరంభంలో నానితో తొలిసారిగా ‘నేను లోకల్’ సినిమాలో నటించింది కీర్తి. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి గత ఏడాది రిలీజైన ‘దసరా’లో నటించారు. సినిమాను దాటి నానితో తనకు ఫ్రెండ్షిప్ ఉందని.. తన కుటుంబ సభ్యులు కూడా తనకు చాలా క్లోజ్ అని కీర్తి వెల్లడించింది.
అర్జున్ చాలా క్యూట్‌గా ఉంటాడు, క్యూట్‌గా మాట్లాడతాడని చెప్పిన కీర్తి.. తనకు అప్పుడప్పుడే మాటలు వస్తున్న సమయంలో తనకు బర్త్ డే విషెస్ చెప్పిన ఆడియోను పంచుకుంది. లవ్ యూ, మిస్ యూ లాంటి పదాలను ముద్దు ముద్దుగా పలికిన ఆడియోలను కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో వినిపించింది.
తనకు ఎప్పుడైనా మనసు బాలేక, డల్లుగా ఉన్నపుడు జున్ను ఆడియోలు వింటే మళ్లీ యాక్టివ్ అవుతానని కీర్తి చెప్పడం విశేషం. అంతే కాక జున్ను తనను అత్త అని పిలుస్తాడని.. తాను నాని ఇంటికి ఎప్పుడు వెళ్లినా కొంచెం పెద్దవాడై కనిపిస్తాడని.. తన ఎదుగుదల చూస్తుంటే ఆనందం కలుగుతుందని కీర్తి చెప్పింది.
This post was last modified on July 31, 2024 3:18 pm
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…