దర్శకుడు శీను వైట్ల ఎంత పెద్ద హీరోలతో సినిమాలు తీసినా తనదైన శైలిలో కామెడీ ట్రాక్స్ తో ప్రేక్షకులను నవ్వించడం ఎన్నోసార్లు గొప్ప ఫలితం ఇచ్చింది. దూకుడు లాంటి సీరియస్ సబ్జెక్టులో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణలతో చేయించిన హాస్యం ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్ రూపంలో తిరుగుతూనే ఉంటుంది. మహేష్ బాబు అంతటి సూపర్ స్టార్ సైతం టైమింగ్ తో ఆడుకోవడం అందులో చూడొచ్చు. ఇక రవితేజ వెంకీ ట్రైన్ ఎపిసోడ్ సంగతి సరేసరి. నలభై అయిదు నిమిషాల పాటు సాగే ఈ సుదీర్ఘమైన ట్రాక్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు.
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే తరహా వింటేజ్ రైలుని శీను వైట్ల విశ్వంలో వాడారు. గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఒక చిన్న మేకింగ్ వీడియో వదిలారు. అందులో హీరో హీరోయిన్ తో పాటు నరేష్, ప్రగతి, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి తదితరులతో పెద్ద క్యాస్టింగ్ తీసుకొచ్చి పెట్టారు. ఇది కూడా వెంకీ లాగే రన్నింగ్ ట్రైన్ సెటప్ లోనే నడుస్తోంది. విజువల్స్ చూస్తుంటే పూర్తి ఫన్ మీద ఆధారపడి రాసుకున్నట్టు అర్థమవుతోంది. పేలితే మాత్రం రిపీట్ ఆడియన్స్ ఉంటారు.
గత కొంత కాలంగా సక్సెస్ లేక గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్లకు విశ్వం హిట్ కావడం చాలా కీలకం. ఒక నిర్మాణ సంస్థతో మొదలై తర్వాత చిన్న బ్రేక్ పడి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జతకట్టాక వేగం పెరిగి ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. గోపీచంద్ కూడా విజయం కోసం పోరాడుతున్నవాడే. తన స్టామినాకు తగ్గ సినిమా పడటం లేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్న టైంలో విశ్వం జరుగుతోంది. డైరెక్టర్ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా ఒకప్పటి ఆయన స్టైల్ లో తీయడం చూస్తే క్రమంగా అంచనాలు పెరిగేలా ఉన్నాయి. ఇంకా విడుదల ఖరారు కాని విశ్వంని సెప్టెంబర్ లో థియేటర్లకు తీసుకొచ్చే అవకాశముంది.
This post was last modified on July 31, 2024 1:39 pm
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…