వచ్చే నెల ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కొద్దిరోజుల్క్ క్రితం ముగిశాయి. కానీ లైగర్ సమయంలో తీవ్ర నష్టాలు చవి చూసిన ఎగ్జిబిటర్లు దానికి నిరసనగా ఈ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వరనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
ఏషియన్ సునీల్, దిల్ రాజు లాంటి పెద్దోళ్ళకు కూడా ఇంకా అప్పటి రికవరీ తాలూకు సొమ్ములు ముట్టాల్సి ఉండటంతో వాళ్ళ ఆధీనంలో ఉన్న స్క్రీన్లు కనక డబుల్ ఇస్మార్ట్ కు దక్కకపోతే ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అవన్నీ మిస్టర్ బచ్చన్, ఆయ్, తంగలాన్ కు వెళ్లిపోతాయి.
ప్రస్తుతం వీటికి సంబంధించిన చర్చలే అంతర్గతంగా జరుగుతున్నట్టు వినిపిస్తోంది. గత ఏడాదే లైగర్ ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత సునీల్ నారంగ్ లాంటి సీనియర్లు సర్దిచెప్పి గొడవ కాకుండా చూశారు.
పూరి, చార్మీ ఏకమొత్తంగా వరంగల్ శీనుకి హక్కులు అమ్మినప్పటికీ ఆయన ద్వారా కొన్న బయ్యర్లకు పూర్తి సెటిల్ మెంట్ జరగలేదనేది ప్రధాన వివాదం. తర్వాత ఎలాగూ మరో సినిమా వస్తుంది కదా అప్పుడు అడుగుదామని ఆగిపోయారు. తీరా చూస్తే డబుల్ ఇస్మార్ట్ హక్కులు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి సొంతం చేసుకోవడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
ఇవన్నీ లోలోపల జరిగే చర్చలు కాబట్టి అధికారికంగా ఎలాంటి సమర్ధన, ఖండన రాకపోవచ్చు కానీ మొత్తానికి ఏదో రకంగా సెటిల్ చేసే పనిలో పెద్దలు ఉన్నట్టు సమాచారం. ఆగస్ట్ 15 విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఏ చిన్న రిస్కుకి నిర్మాతలు సిద్ధంగా లేరు. ఏదో ఒక రకంగా సమస్య పరిష్కరించుకోవాల్సిందే.
ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ కాకపోయినా ఎగ్జిబిటర్లకు సరిపడా వేరే సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. అవి చాలవనుకుంటే బాలీవుడ్ మూవీస్ మూడొస్తున్నాయి. సో డబుల్ ఇస్మార్ట్ మెడకు చుట్టుకున్న లైగర్ పీఠముడి వీలైనంత త్వరగా వీగిపోవాలని రామ్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి.
This post was last modified on July 31, 2024 12:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…