తమిళ సినీ పరిశ్రమలో ఇటీవలి నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడి నిర్మాత మండలి తీసుకున్న నిర్ణయాల గురించి టాలీవుడ్లో సైతం చర్చ జరుగుతోంది. ఆర్టిస్టులు అడ్వాన్సులు తీసుకుంటే వెంటనే సినిమాలు చేయాలని.. ఒక సినిమా కోసం అడ్వాన్స్ తీసుకుని వేరే చిత్రాన్ని మొదలుపెడితే ఊరుకోబోమని తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ల దగ్గరున్న అడ్వాన్సుల వివరాలన్నీ తెప్పిస్తున్నారు. వీటి సంగతి తేలే వరకు కొత్త సినిమాలు మొదలుపెట్టకుండా నిషేధం కూడా విధించారు.
ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలన్నింటినీ అక్టోబరు 31లోపు పూర్తి చేయాలనే కండిషన్ పెట్టారు. మరోవైపు పెద్ద హీరోల సినిమాలను ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసేలా తీర్మానం చేశారు. ఇలా నిర్మాతల మంచి కోసం మరి కొన్ని సంచలన నిర్ణయాలు తమిళ నిర్మాతల మండలి తీసుకుంది.
దీని గురించి ఇప్పుడు టాలీవుడ్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగులో కూడా ఇదే సమస్యలతో నిర్మాతలు సతమతం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్లో కంటే టాలీవుడ్లోనే ఈ సమస్యలు పెద్దవిగా తయారయ్యాయి. హీరోలు, దర్శకుల వద్ద పెద్ద ఎత్తున నిర్మాతల అడ్వాన్సులు ఇరుక్కున్నాయి.
ఒక హీరో అయినా, దర్శకుడు అయినా హిట్ కొట్టాడంటే చాలు.. పది మంది నిర్మాతలు వెళ్లి లైన్లో నిలబడతారు. అడ్వాన్సులు ఇచ్చేస్తారు. కానీ వీరిలో కమిట్మెంట్లు ఇచ్చిన వాళ్లందరికీ సినిమాలు చేయడం అంత తేలిక కాదు. ఇలా అడ్వాన్సులు తీసుకుని హీరోలు, దర్శకులు వైభవం చూస్తున్నారు కానీ.. ఆ అడ్వాన్సులకు వడ్డీలు కడుతూ నిర్మాతలు అన్యాయం అయిపోతున్నారు. మరోవైపు సినిమా రిలీజైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడం వల్ల పెద్ద నష్టమే జరుగుతోంది. థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు. థియేట్రికల్ బిజినెస్ మీద క్రమంగా అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో తమిళంలో మాదిరే నిర్మాతలు సమావేశమై.. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ నిర్మాతల మండలి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి అమలవుతాయనే నమ్మకమే ఎవరికీ కలగట్లేదు.
థియేట్రికల్, ఓటీటీ రిలీజ్‌కు మధ్య గ్యాప్ గురించి పలుమార్లు తీర్మానాలు జరిగాయి. కానీ ఆ సమావేశాల్లో ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్లే.. దాన్ని బ్రేక్ చేస్తూ తమ చిత్రాలను గడువు కంటే ముందే తమ చిత్రాలను ఓటీటీలకు ఇచ్చేశారు. ఇక కథల కంటే కాంబినేషన్ల మీద ఎక్కువ దృష్టిపెడుతున్న నిర్మాతలు.. హీరోలు, దర్శకుల వెంట పడుతూ బలవంతంగా అడ్వాన్సులు ఇవ్వడం టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రాక్టీస్. అవతలి వాళ్లు వద్దంటున్నా కమిట్మెంట్ కోసం నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి మళ్లీ డబ్బులు ఇరుక్కుపోయాయని బాధ పడడం సర్వసాధారణం అయిపోయింది. టాలీవుడ్లో కూడా కోలీవుడ్లో మాదిరే కఠిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నా.. అవి ఆచరణ సాధ్యం మాత్రం కాదని నిర్మాతలే మాట్లాడుకుంటున్నారు.
This post was last modified on July 30, 2024 2:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…