పూరి జగన్నాథ్, రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం.. డబుల్ ఇస్మార్ట్. నాలుగేళ్ల కిందట బ్లాక్‌బస్టర్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మామూలుగా ఒక హిట్ మూవీ సీక్వెల్ వస్తుంటే.. మంచి బజ్ క్రియేట్ అవుతుంది. బిజినెస్‌కు ఢోకా ఉండదు. సక్సెస్ మీద కూడా టీం ధీమాగా ఉంటుంది. అలాగే థియేటర్ల సమస్యలు కూడా ఉండవు. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ విషయంలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
పూరి చివరి సినిమా ‘లైగర్’ డిజాస్టర్ కావడం ఆయన మీద విపరీతమైన ప్రెజర్ పెంచింది. ఆ సినిమా నష్టాలను సెటిల్ చేయాల్సిన స్థితిలో పూరి ‘డబుల్ ఇస్మార్ట్’ను మొదలుపెట్టారు. దీంతో కచ్చితంగా ఈ సినిమాను హిట్ చేసి తీరాలి. కానీ రిలీజ్ దగ్గర పడేకొద్దీ ఈ సినిమాను సమస్యలు చుట్టుముడుతున్నాయి.
ముందేమో ఆగస్టు 15 లాంటి క్రేజీ డేట్ దక్కిందని సంబరపడ్డారు. ఆ సీజన్లో రిలీజయ్యే పెద్ద సినిమా ఇదొకటే అనుకున్నారు. కానీ తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ పోటీకి వచ్చింది. అయినా పర్లేదనుకున్నారు. కానీ ఈ మధ్యే ‘మిస్టర్ బచ్చన్’ కూడా రేసులోకి వచ్చింది. రవితేజ సినిమా అంటే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అదే అవుతుంది. ‘తంగలాన్’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. మరోవైపు ‘ఆయ్’ అనే చిన్న సినిమా కూడా పోటీలో ఉంది. దాని కంటెంట్ మీద నిర్మాతలు ఎంతో ధీమాగా ఉన్నారు. కాబట్టి పోటీ పెద్ద సమస్యే. మరోవైపు ‘మార్ ముంత చోడ్ చింత’ పాటకు సంబంధించిన వివాదం వల్ల కొందరేమో ‘డబుల్ ఇస్మార్ట్’ను బహిష్కరిస్తామంటున్నారు.
ఈ సమస్య చాలదన్నట్లు ‘లైగర్’ నష్టాల సెటిల్మెంట్ జరక్కపోవడం, ఈ విషయంలో నిర్మాతల మండలి పూరికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఎగ్జిబిటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని అనధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ‘డబుల్ ఇస్మార్ట్’కు పెద్ద సమస్య వచ్చినట్లే. ఇన్ని తలనొప్పుల మధ్య సినిమా రిలీజై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో, అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న టెన్షన్ నెలకొంది.
This post was last modified on July 30, 2024 2:00 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…