ఇటీవలే విడుదలైన ధనుష్ రాయన్ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా దాన్ని అభినందిస్తూ పెట్టిన ట్వీట్ తమిళ సినీ ప్రియులను ఎక్కడో టచ్ చేసింది. అద్భుతమైన దర్శకత్వంతో పాటు అమోఘమైన నటన తనను కట్టిపారేసిదంటూ ఏఆర్ రెహమాన్ తో పాటు సినిమాకు పని చేసిన వాళ్ళ మీద ప్రశంసలు కురిపించడం క్షణాల్లో వైరలయ్యింది. పక్క భాష మూవీ అందులోనూ డబ్బింగ్ అయినా సరే ఇంతగా సాటి హీరో కం దర్శకుడి పనితనాన్ని మెచ్చుకోవడం పట్ల ధనుష్ తో పాటు ఇతర అభిమానులు ప్రత్యేకంగా దాన్ని షేర్ చేసుకుని మరీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పలువురు కోలీవుడ్ క్రిటిక్స్ సైతం పోటీతత్వాన్ని ప్రేమించే ఇలాంటి గుణం చాలా మంది తమిళ హీరోల్లో లేదని, కార్తీ లాంటి కొందరు తప్ప మిగిలిన వాళ్ళు కల్కి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతాలు వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటారని దెప్పి పొడిచారు. ఒక కమర్షియల్ డ్రామా అయిన రాయన్ ని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేకపోయినా, ధనుష్ డైరెక్షన్ లోని తపనని గుర్తించి తన వంతుగా శుభాకాంక్షలు చెప్పారని మెచ్చుకున్నారు. దీని వల్ల తెలుగులో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని, మహేష్ బాబు మాట వల్ల అతని అభిమానులు రాయన్ ఖచ్చితంగా చూస్తారని అంటున్నారు.
నిజమే మరి. ఇలా పరస్పరం గౌరవించుకునే ధోరణి ఖచ్చితంగా ఉండాలి. ఎలాగూ బాలీవుడ్ స్టార్లు ఇలాంటివి చేయరు. బాహుబలి నుంచి కల్కి దాకా లోలోపల రగిలిపోయిన వాళ్లే కానీ బాహాటంగా సౌత్ సినిమా గొప్పదనం ఒప్పుకున్న హీరోలు తక్కువే. సో పొరుగున ఉన్న తమిళ, కన్నడ, మలయాళం హీరోలు అభినందనలు చెప్పుకోవడం అవసరం. రాయన్ తమిళంలో గట్టిగా ఆడుతున్నా తెలుగులో మాత్రం వీక్ డేస్ నుంచి బాగా నెమ్మదించేసింది. ఇక్కడ యునానిమస్ గా హిట్ టాక్ రాకపోవడం కలెక్షన్లను ప్రభావితం చేస్తోంది. చూడాలి మరి మహేష్ ప్రోత్సాహం ఏ మేరకు దోహదం చేస్తుందో.
This post was last modified on %s = human-readable time difference 11:03 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…