గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే తన ప్రతిభతోనే కాక సామాజిక ఉద్యమకారిణిగా చిన్మయి ఎక్కువ గుర్తింపే సంపాదించింది. ‘మీ టూ’ ఉద్యమం మొదలైనపుడు, ఆ తర్వాత అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాల గురించి ఆమె ఎంత బలంగా గళం వినిపించిందో తెలుసు. ఈ క్రమంలోనే బాలల హక్కులు.. వారి మీద జరిగే లైంగిక వేధింపుల గురించి తరచుగా ప్రస్తావిస్తూ జనాలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తోంది చిన్మయి.
ఐతే కొన్నిసార్లు ఈ అంశంలో ఆమె అభిప్రాయాలు, వాదనలు కొంచెం హద్దులు దాటుతున్నాయనే అభిప్రాయాలూ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంటాయి. ఇలాంటి వ్యవహారాల్లో చిన్మయిని తప్పుబట్టడం కాదు కానీ.. మెజారిటీ నెటిజన్లకు తన పోస్టులు రుచించట్లేదు. ఇందుకు ఉదాహరణ.. చిన్మయి లేటెస్ట్ పోస్ట్.
తన కూతురికి ఇష్టం లేదని తన భర్త రాహుల్ రవీంద్రన్ తనను కౌగిలించుకోవడమే మానేసినట్లు చిన్మయి ఈ పోస్టులో పేర్కొంది. “కొన్ని రోజుల కిందట రాహుల్ మా అమ్మాయిని కౌగిలించుకోవాలని చూశాడు. రెండేళ్ల వయసున్న తను అందుకు ఇష్టపడలేదు. అందుకు రాహుల్.. “నన్ను కౌగిలించుకోమని నిన్ను బలవంతపెట్టను దృప్తా. కానీ నాన్న నిన్ను ఎంతో ఇష్టపడతాడు” అని బదులిచ్చాడు. మళ్లీ తనను హత్తుకోవడానికి రాహుల్ ప్రయత్నించనే లేదు. ఒక పెద్ద వ్యక్తిగా నేనూ ఇదే పాటిస్తాను. అమ్మాయి అయినా సరే.. ఆరేడేళ్ల వయసున్న పాపను నీ బుగ్గ గిల్లొచ్చా అని అనుమతి అడుగుతాను. తనను ముట్టుకోవడానికి ముందే తల్లిదండ్రుల అనుమతి అడుగుతాను” అని చిన్మయి పేర్కొంది.
ఈ పోస్ట్ నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్మయిని సమర్థిస్తున్న వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో ఇది టూమచ్ అంటూ విమర్శిస్తున్న వాళ్లూ ఉన్నారు. మొత్తానికి తన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
This post was last modified on July 29, 2024 4:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…