అంతో ఇంతో ఇమేజ్ ఉన్న హీరోలకే ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయింది. అలాంటిది ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుతో టైటిల్ రోల్ చేయించి దాన్ని రిలీజ్ చేయడమంటే మాటలు కాదు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం నిర్మాతలు ఆ రిస్క్ చేశారు. రావు రమేష్ హీరోగా రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 23 విడుదలవుతోంది. నిన్న ట్రైలర్ వదిలారు. కామెడీ బాగానే వర్కౌట్ చేసినట్టు కనిపిస్తోంది. కుర్రాడు అంకిత్ కొయ్య ఆయన కొడుకుగా కీలక పాత్ర పోషించిన ఈ చిన్న సినిమాకు పెద్ద అండదండలు అందుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒకరకమైన ఘనతగానే చెప్పుకోవాలి.
దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యంకు సమర్పకురాలిగా వ్యవహరించగా రామ్ చరణ్ ద్వారా ట్విట్టర్ లో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఆంధప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని మైత్రి మూవీ మేకర్స్ కొనేసుకున్నారు. సో థియేటర్ల సమస్య రాదు. ఎలాగూ ఆగస్ట్ 15 రిలీజయ్యే డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ మూడింటి నైజామ్ రైట్స్ మైత్రి దగ్గరే ఉన్నాయి. సో స్క్రీన్లు ఎక్కువ తక్కువ ఎలాంటి అవసరం వచ్చినా మైత్రి నెట్ వర్క్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. పాజిటివ్ టాక్ రావడమొకటే ఆలస్యం.
ఒక మధ్యతరగతి తండ్రి సెల్ ఫోన్ కొన్నాక అతని అకౌంట్ లో లెక్కలేనంత డబ్బు వచ్చాక ఏం జరిగిందనే పాయింట్ తో మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రూపొందింది. దర్శకుడు లక్ష్మణ్ కార్య నటుడు రావు రమేష్ టైమింగ్ ని ఫుల్లుగా వాడుకున్నట్టు ట్రైలర్ లో అర్థమైపోయింది. క్యాస్టింగ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఆగస్ట్ 29 నాని సరిపోదా శనివారం వస్తున్న నేపథ్యంలో వీలైనంత మొదటి వారమే రాబట్టుకోవడం సుబ్రహ్మణ్యంకు కీలకం కానుంది. సపోర్టింగ్ రోల్స్, విలన్ గా ఇలా ఎన్నోరకాలుగా అలరించిన రావు రమేష్ హీరోగా ఎలాంటి ఫలితం అందుకోబోతున్నాడో వచ్చే నెల మూడో వారంలో తేలనుంది.
This post was last modified on July 29, 2024 12:41 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…