ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా సరే రెండు వారాలు దాటితే ఖచ్చితంగా నెమ్మదించే పరిస్థితిలో కల్కి 2898 ఏడి దూకుడు ఇంకా కొనసాగుతోంది. తర్వాత వచ్చిన కొత్త రిలీజులు ఆశించిన స్థాయిలో కాదు కదా కనీస రేంజ్ లో మెప్పించలేకపోవడం ప్రభాస్ మూవీకి వరంగా మారుతోంది. నిన్న కల్కికి 32వ రోజు. బుక్ మై షోలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బుక్ అయిన టికెట్లు అక్షరాలా 63 వేలు. డెడ్ పూల్ వాల్వరిన్ కాకుండా ఇంకే సినిమా నిన్న ట్రెండింగ్ లో లేదు ఒక్క కల్కి తప్ప. దీన్ని బట్టి వీకెండ్ లో తెలుగు ప్రేక్షకులు ఛాయస్ మళ్ళీ ఇదే అయ్యిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
ఇప్పటికీ పదకొండు వందల కోట్ల గ్రాస్ దాటేసిన కల్కి ఎప్పుడు నెమ్మదిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటిటిలో త్వరగా రాదనే వాస్తవం జనాలకు బాగా రీచ్ కావడంతో థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం కుటుంబ ప్రేక్షకులు కల్కికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ ఇలా ఉంటే ఆ చార్జీలు మిగిలించుకుందామని నేరుగా థియేటర్ కౌంటర్లో టికెట్లు కొనే బాపతు భారీగా ఉంటారు. పరిమిత షోలే అయినప్పటికీ నిన్న చాలా చోట్ల ఈవెనింగ్ షోలు హౌస్ ఫుల్ కావడం గమనార్హం. పురుషోత్తముడు లాంటివి మినిమమ్ ఆక్యుపెన్సీకి పోరాడగా రాయన్ ఒక్కటే మెయిన్ సెంటర్స్ లో తట్టుకుంది.
ట్రూ బ్లాక్ బస్టర్ అనే పదానికి కల్కి నిర్వచనంలా నిలుస్తోంది. ఆగస్ట్ 1, 2 తేదీల్లో వరసగా బోలెడు రిలీజులు ఉన్నప్పటికీ వాటిలో స్టార్ హీరోలు ఉన్నవి లేకపోవడం మరో వీకెండ్ కి అవకాశం కలిగించవచ్చు. ఆగస్ట్ 15 మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వచ్చే దాకా పెద్ద మార్పు ఉండేలా లేదు. కల్కి 2898 ఏడికి మంచి కౌంట్ లో అర్ధశతదినోత్సవం జరగాలని కోరుకుంటున్న అభిమానుల ఆకాంక్ష ఎంత మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి. ఇంకో పద్దెనిమిది రోజులు ఉన్న నేపథ్యంలో స్క్రీన్లు గణనీయంగా తగ్గిపోవచ్చు. మరి ఎన్ని సెంటర్స్ లో ఫిఫ్టీ డేస్ మైలురాయి అందుకుంటుందో చూద్దాం.
This post was last modified on July 29, 2024 10:50 am
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…