Movie News

క్లాష్ కారణం వివరించిన హరీష్ శంకర్

ఆగస్ట్ 15 విడుదల తేదీని ముందు ప్రకటించుకున్న డబుల్ ఇస్మార్ట్ తో తలపడుతూ మిస్టర్ బచ్చన్ అదే డేట్ తీసుకోవడం గురించి అభిమానుల్లో, ఇండస్ట్రీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఇలా క్లాష్ అవుతున్నారనే కోణంలో ఫ్యాన్స్ పరస్పరం ట్రిగ్గర్ చేసుకోవడం కనిపిస్తోంది. దానికి తోడు ఛార్మీ హరీష్ శంకర్, రవితేజ ఇద్దరినీ ఇన్స్ టాలో ఆన్ ఫాలో చేసిందనే వార్త మరింత వేడిని రాజేసింది. ఇవాళ జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇచ్చి దీని వెనుక ఎవరున్నారో వివరించి మరీ సందేహాలకు చెక్ పెట్టేశారు.

హరీష్ శంకర్ చెప్పిన వెర్షన్ ఇలా ఉంది. మిస్టర్ బచ్చన్ ముందు ఆగస్ట్ 15 ఆప్షన్ పెట్టుకోలేదు. ఎప్పుడైతే పుష్ప 2 వాయిదా పడిందో మైత్రి డిస్ట్రిబ్యూషన్ తరఫున వాటి వ్యవహారాలు చూసుకునే శశి ఒత్తిడి చేసి ఈ డేట్ ని తీసుకోమని చెవిలో జోరీగలాగా పోరు పెట్టేశారు. అప్పటిదాకా కొంత రిలాక్స్ గా ఉన్న రవితేజ టీమ్ ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయి పనులు వేగవంతం చేసింది. దీనికి తోడు ఫైనాన్స్ కు సంబంధించిన వ్యవహారాలు, ఓటిటి ఇష్యూస్ సమస్యని మరింత జటిలం చేశాయి. ఈ పరిణామం వల్ల తొలుత అనౌన్స్ మెంట్ ఇచ్చిన డబుల్ ఇస్మార్ట్ తో ఢీ కొనక తప్పని పరిస్థితి నెలకొంది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబుల్ ఇస్మార్ట్ తో మిస్టర్ బచ్చన్ ఫేస్ టు ఫేస్ నిలబడక తప్పలేదు. పూరి జగన్నాధ్ మీద అపారమైన గౌరవాన్ని చెప్పిన హరీష్ శంకర్ ఎప్పటికీ ఆయన స్థాయి స్థానం వేరని ఇదంతా అనుకోకుండా జరిగిందని కుండ బద్దలు కొట్టేశారు. ఏది ఏమైనా కల్కి 2898 ఏడి తర్వాత పెద్ద హీరోల సినిమాలు రాలేదని ఫీలవుతున్న మూవీ లవర్స్ కు కనువిందు చేసేందుకు ఇండిపెండెన్స్ డేకి పలు చిత్రాలు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది. ఆయ్ లాంటి చిన్న బడ్జెట్ మూవీ కూడా తగ్గేదేలే అనడం చూస్తే ఇది ఆ డేట్ ని అందరూ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది.

This post was last modified on July 28, 2024 9:01 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

5 hours ago