సరిగ్గా నెల రోజుల్లో సరిపోదా శనివారం విడుదలకు రంగం సిద్ధమవుతోంది. గత రెండు రోజుల నుంచి నిర్మాణ సంస్థ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్ల వేగం పెంచి సినిమాలో పాత్రలన్నీ పరిచయం చేసే పనిలో పోస్టర్లు వదులుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు పబ్లిసిటీ మోతాదు సరిపోవడం లేదని న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ ఫీలవ్వడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. భారీగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. హాయ్ నాన్న తర్వాత నానికి ఏకంగా ఎనిమిది నెలల గ్యాప్ రావడం వల్ల ఎక్కువ ఆశిస్తున్నారు.
వాస్తవిక కోణంలో చూస్తే సరిపోదా శనివారం చేతిలో నాలుగు శనివారాలు ఉన్నాయి. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది కాబట్టి ఆందోళన చెందడానికి ఏమి లేదు. పైగా ఆగస్ట్ 29 ఏ పోటీ లేదు. అంతకు ముందు వారం రావు రమేష్ టైటిల్ రోల్ పోషించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం తప్ప ఏ రిలీజులు ప్లాన్ చేయలేదు. ఇది రిస్క్ ఇచ్చే పోటీ కాదు. ఆగస్ట్ 15 రిలీజయ్యే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ లు మంచి టాక్ తో ఆడుతున్నా అప్పటికంతా రెండు వారాలు గడిచిపోయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెమ్మదిస్తాయి. ఇది నాని మూవీకి సానుకూలంగా మారుతుంది.
సో టెన్షన్ పడేందుకు లేదు. కాకపోతే సెప్టెంబర్ 5 విజయ్ గోట్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం వచ్చే అవకాశం ఉంది కనక అది వాయిదా పడకపోతే ఇతర రాష్ట్రాల్లో సరిపోదా శనివారంకి చిక్కు ఎదురవుతుంది. అదే వారంలో సుందరకాండ, లక్కీ భాస్కర్, బచ్చలమల్లి రెడీ అవుతున్నాయి. ఏవి ఉంటాయో, డ్రాప్ అవుతాయో చెప్పలేం కానీ నాని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం కీలకం. మొదటిసారి దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకున్నాడు. క్యారెక్టర్లు, వాటి నేపధ్యాలు, ఊరి సెటప్ అంతా ఆసక్తికరంగా ఉన్నాయి. గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంక మోహన్ రెండోసారి నానితో జట్టుకట్టింది.
This post was last modified on July 29, 2024 11:10 am
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్‌లో అక్కినేని వారిది…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన…
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…
"ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!"- జాతీయ స్థాయి నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్…