ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలన తప్ప మరో ప్రపంచం లేకుండా ఉన్నారు. తెల్లవార్లూ మీటింగులు, సమీక్షలు, చర్యలతోనే కాలం గడిచిపోతోంది. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కలిసినా ఎక్కువ సమయం గడపలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తిరిగి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయని ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేయలేకపోతున్నారు. కారణం నిత్యం తమ హీరో పడుతున్న కష్టం కళ్ళముందు కనిపిస్తోంది కాబట్టి. అసెంబ్లీ సమావేశాల్లోనూ పవన్ తనదైన ముద్రతో భవిష్యత్ ప్రణాళికను స్పష్టంగా వివరించడం ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉండగా పవన్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో అత్యవసర స్థితిలో ఉన్నవి హరిహర వీరమల్లు, ఓజి. కొంత భాగమే బ్యాలన్స్ ఉన్నప్పటికీ కనీసం చెరో నెల రోజులు కాల్ షీట్లు ఇస్తే తప్ప పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళలేవు. పవన్ హామీ ఇచ్చాడు కానీ ఎప్పుడనేది ఇంకా తేలలేదు. మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డితో నిర్మాత రామ్ తాళ్ళూరి ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ వచ్చి మూడేళ్లవుతోంది. పూజా కార్యక్రమాలు చేశారు. స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నారు. ప్రీ లుక్ థీమ్ పోస్టర్ కూడా వదిలారు. కానీ ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లలేకపోయింది. ఇవాళ దీని ప్రస్తావన వచ్చింది.
ఇదే బ్యానర్ లో రూపొందిన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ టీజర్ లాంచ్ లో నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ పవన్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నామని, త్వరలో జరగొచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగే ఖచ్చితంగా ఉంటుందో లేదో గ్యారెంటీ లేని సిచువేషన్ లో అసలు రెగ్యులర్ షూటింగే మొదలుకాని సురేందర్ రెడ్డి చిత్రానికి ఓకే అంటారా అంటే ఏమో చెప్పలేం. పవన్ మాత్రం సినిమాల కంటే సీరియస్ గా రాజకీయాల మీద దృష్టి పెట్టడంతో వీరమల్లు, ఓజి పూర్తయి థియేటర్లకు వస్తే చాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 28, 2024 5:55 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…