Movie News

తేజు.. అంతా సెట్టయినట్లేనా?

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఒకప్పుడు ఎంత హుషారుగా ఉండేవాడో తెలిసిందే. కానీ మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాక ఆ జోష్ అంతా పోయింది. తన లుక్స్ మారిపోయాయి. రీఎంట్రీ మూవీ ‘విరూపాక్ష’లో తేజు బొద్దుగా కనిపించాడు. తన కదలికల్లో చురుకుదనం కనిపింంచలేదు. డైలాగ్ డెలివరీ సైతం మారిపోయింది. రీఎంట్రీలో పెద్ద హిట్టయితే కొట్టాడు కానీ.. తెర మీద అతణ్ని చూస్తే కొంచెం తేడాగానే కనిపించాడు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘బ్రో’లోనూ తేజులో హుషారు కనిపించలేదు.

ఐతే ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకోలేదని.. తనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటన్నింటినీ అధిగమించి పూర్తి ఫిట్‌గా తయారు కావడానికి టైం పడుతుందని.. అందుకోసం గ్యాప్ కూడా తీసుకుంటున్నానని చెప్పాడు.

ఐతే ఆ టైంలో మూణ్నాలుగు నెలలే గ్యాప్ అని చెప్పాడు కానీ.. ‘బ్రో’ రిలీజై ఏడాది కావస్తున్నా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు తేజు. సంపత్ నందితో అతను చేయాల్సిన ‘గాంజా శంకర్’ ఆగిపోవడమే గ్యాప్ పెరగడానికి కారణం కావచ్చు. ఐతే అనుకోకుండా వచ్చిన ఈ లాంగ్ గ్యాప్‌ను తేజు బాగానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరంగా అతను అన్ని సమస్యలనూ అధిగమించాడని అంటున్నారు.

తన కొత్త చిత్రం కోసం తేజు ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీ పెంచుతున్నాడట. కొన్ని నెలలుగా బయటికి రాని తేజు.. పూర్తి ఫిట్‌గా తయారైన కొత్త లుక్‌తో ఆశ్చర్యపరచనున్నాడట. సిక్స్ ప్యాక్ చేసే స్థాయికి వచ్చాడంటే తేజు పూర్తిగా కోలుకున్నాడని భావించవచ్చు. రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో తేజు ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

This post was last modified on July 27, 2024 10:29 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago