ఒక హీరోయిన్ నటించిన తొలి సినిమా సక్సెస్ అయ్యాక తనకు పేరు రావడం.. బిజీ అవ్వడం మామూలే. కానీ తొలి చిత్రం రిలీజవ్వకముందే ఆ కథానాయికకు హైప్ వచ్చేయడం.. అవకాశాలు వరుస కట్టడం అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే విషయంలో అదే జరుగుతోంది. మాస్ రాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో ఈ అమ్మాయి టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది.
ఐతే ఈ సినిమా ప్రారంభోత్సవంలో భాగ్యశ్రీని చూడగానే హరీష్ సెలక్షన్ సూపర్ అనే కామెంట్లు వినిపించాయి సోషల్ మీడియాలో. ఇక ‘మిస్టర్ బచ్చన్’ నుంచి తొలి ప్రోమో రిలీజవడం ఆలస్యం.. ఈ అమ్మాయి కుర్రకారును ఒక ఊపు ఊపేస్తుందని.. స్టార్ హీరోయిన్ అయిపోతుందని తీర్మానాలు చేసేశారు. ఇప్పుడు అదే జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ నుంచి రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ భాగ్యశ్రీ సెక్సీ లుక్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఆల్రెడీ టాలీవుడ్లో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో భాగ్యశ్రీ కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు ‘మిస్టర్ బచ్చన్’లో భాగ్యశ్రీ అందాలు చూసేందుకు యువ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాలో కనువిందు చేయడానికి ముందే భాగ్యశ్రీ సోషల్ మీడియాకు తన ఫొటో షూట్లతో విందు అందించే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ డ్రెస్‌లో ఆమె చేసిన కొత్త ఫొటో షూట్‌లో లుక్స్ సూపర్ సెక్సీగా ఉన్నాయి. ఆ ఫొటోలు చూసి ఆమె కొత్త అమ్మాయి కాదు, కత్తి అమ్మాయి అని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. తొలి సినిమా విడుదలకు ముందే మాంచి ఫాలోయింగ్ సంపాదించిన భాగ్యశ్రీ.. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on July 27, 2024 6:53 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…