ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘దేవర’ విడుదలకు ఇంకో రెండు నెలలే సమయం ఉంది. ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబరు 10కి వాయిదా వేశారు. ఐతే అంతకంటే ముందే సినిమా రెడీ అయ్యేలా ఉండడం, దసరా టైంలో పోటీ ఎక్కువగా ఉండడంతో సెప్టెంబరు 27కు ఈ చిత్రాన్ని ప్రి పోన్ చేశారు.
ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ‘వార్-2’ కోసం డేట్లు కేటాయిస్తున్నాడు. చిన్న చిన్న సీన్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఈ సినిమా కాస్టింగ్ గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటికి రావడం విశేషం. ఇందులో ‘యానిమల్’ నటుడు బాబీ డియోల్ ఒక విలన్‌గా నటిస్తున్నాడట. ఇది నిజమైతే సినిమాకు క్రేజీ అడిషన్ అనే చెప్పాలి.
కానీ షూటింగ్ అంతా అయిపోయిందనుకున్న దశలో ఈ కొత్త అడిషన్ ఏంటన్నదే అర్థం కావడం లేదు. ‘దేవర’లో సైఫ్ అలీఖాన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే మెయిన్ విలన్. మరి ఒక బాలీవుడ్ స్టార్‌ను విలన్‌గా పెట్టుకుని ఇంకో బాలీవుడ్ ప్రముఖుడిని మళ్లీ విలన్‌గా తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న రేకెత్తుతోంది.
ఐతే ‘దేవర’ రెండు భాగాలుగా తెరకెక్కనున్న నేపథ్యంలో సైఫ్ పాత్ర ఫస్ట్ పార్ట్ వరకు ఉండి.. అది అంతం అయితే బాబీ డియోల్ రూపంలో కొత్త విలన్ తెరపైకి వచ్చేలా చూపించే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయన పాత్ర సెకండ్ పార్ట్‌లో కీలకం అయ్యే అవకాశముంది. చివర్లో ఆయన పాత్రను పరిచయం చేసి వదిలేస్తారేమో. అన్న చర్చ జరుగుతోంది. ‘పుష్ప’లో ఫాహద్ తరహాలో బాబీని దించితే ముగింపు అదిరిపోతుందనడంలో సందేహం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 26, 2024 9:46 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…