వచ్చే నెల విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఆగస్ట్ 15 డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ మీదే ఉంది కానీ అదే నెలాఖరు 29న రిలీజవుతున్న నాని సరిపోదా శనివారం మీదున్న అంచనాలు కూడా మాములుగా లేవు. నిజానికి ఆ రోజు పెద్దగా పోటీ ఏమి లేదు. టాక్ బాగా వస్తే నాని సోలోగా దున్నేస్తాడు. అయితే రీ రిలీజుల రూపంలో ఒక వెరైటీ చిక్కు ఇబ్బంది పెట్టేలా ఉంది. అదేంటో చూద్దాం. సరిగ్గా వారం ముందు చిరంజీవి ఇంద్రని వైజయంతి సంస్థ భారీ ఎత్తున పునఃవిడుదల చేస్తోంది. దానిమీదున్న బజ్ కి కనీసం పది రోజుల రన్ ని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నాడు.
ఒకవేళ అలా జరగకపోయినా ఆగస్ట్ 29న నాగార్జున మాస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ భారీ ఎత్తున సిద్ధం చేస్తోంది. ముందు శివ అనుకున్నారు కానీ తర్వాత మార్చేశారు. డిస్ట్రిబ్యూషన్ పరంగా వీళ్ళకున్న నెట్ వర్క్ తో పాటు మాస్ ని మళ్ళీ థియేటర్లలో చూడాలన్న ఫ్యాన్స్ ఉత్సాహం కాసిన్ని ఎక్కువ థియేటర్లనే తెచ్చేలా ఉంది. తర్వాత సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వస్తోంది. జనసేన గెలుపు తర్వాత సంబరాలు చేసుకోవడానికి అభిమానులు ఈ సినిమానే వేదికగా మార్చుకుంటారు. పైగా పవర్ స్టార్ పుట్టినరోజు. సో చెప్పుకోదగ్గ కౌంట్ లోనే స్క్రీన్లు దక్కుతాయని వేరే చెప్పాలా.
చూస్తుంటే నాని సినిమాకు ఇదో చిన్న సైజు తలనెప్పిగా మారేలా కనిపిస్తున్నా నిర్మాణ సంస్థ డివివి కాబట్టి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు, కాకపోతే మాస్ జనాలు రీ రిలీజ్ యుఫోరియా వైపు ఎక్కువ మొగ్గు చూపితే అప్పుడు కలెక్షన్ల మీద కొంత ప్రభావం ఉంటుంది కానీ పాజిటివ్ టాక్ వస్తే నాని మోత మాములుగా ఉండదు. మాస్ అంశాలతో పాటు స్టైలిష్ యాక్షన్ పొందుపరిచిన దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని, ఎస్జె సూర్యల మధ్య క్లాష్ ని ఎన్నడూ చూడని రేంజ్ లో పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట. హాయ్ నాన్న తర్వాత ఏడు నెలల గ్యాప్ తో నాని చేసిన సినిమా కావడంతో బిజినెస్ పరంగా క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి.
This post was last modified on July 26, 2024 9:23 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…