సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ వల్ల సోలో హీరోగా సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే రిలీజ్ కి కేవలం 60 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా బాలన్స్ షూట్, పాట చిత్రీకరణ పెండింగ్ ఉన్నప్పటికీ బజ్ పెరిగేలా ఎప్పటికప్పుడు పబ్లిసిటీ ప్లాన్లను మార్చుకోవాల్సి ఉంటుంది.
దేవర కన్నా ఆలస్యంగా అక్టోబర్ 10న వస్తున్న కంగువకు నిర్మాతలు అగ్రెసివ్ స్ట్రాటజీ వాడబోతున్నారని సమాచారం. దీనికి దేవరకు కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉంటుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మూడో వారం జూనియర్ ఎన్టీఆర్ కు థియేటర్లు కొనసాగడం కష్టం. ఆలోగా వీలైనంత మొత్తం రాబట్టుకోవాలి. కంగువకు ఏపీ తెలంగాణలోనూ భారీ రిలీజ్ దక్కబోతున్న దృష్ట్యా దేవర నిర్మాతలు థియేటర్ అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అధిక శాతం రెండు వారాలతో సరిపెట్టుకునే ప్రమాదం ఏర్పడవచ్చు. డబ్బింగ్ స్ట్రెయిట్ అనే భేదాలు లేని ఇండస్ట్రీ మనది.
ప్లానింగ్ లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవరలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పరిచయమవుతుండగా రెండో భాగంలో కీలక పాత్ర పోషించబోయే బాబీ డియోల్ కు మొదటి భాగంలోనూ కొన్ని సీన్లు ఉంటాయని వినికిడి. ఇవన్నీ ఒక ఎత్తయితే అనిరుధ్ రవిచందర్ మీదున్న నమ్మకం మరో ఎత్తు. ఫియర్ సాంగ్ తో మెప్పించాడు కానీ బ్యాలన్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా దేవర ఇకపై వేయబోయే అరవై అడుగులు ఆచితూచిగా ఉన్నా వేగంగా పడాల్సిందే.
This post was last modified on July 26, 2024 9:19 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…