సంగీత దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. మిక్కీ జె మేయర్ అనగానే మనకు ఎమోషనల్, సెంటిమెంటల్, క్యూట్ లవ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. కొత్త బంగారు లోకం, మహానటి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్, హ్యాపీ డేస్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందుకే కమర్షియల్ స్టార్లు తనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. పైగా ఎక్కువ యుఎస్ లో ఉండటం కూడా ఒక ప్రతికూలంగా ఉంటూ వచ్చింది. కట్ చేస్తే వచ్చే నెల 15 రాబోతున్న మిస్టర్ బచ్చన్ కి మిక్కీ ఇచ్చిన సాంగ్స్ వింటున్న వాళ్ళు ఇవి నిజంగా ఆయన ఇచ్చినవేనా అంటూ చర్చించుకుంటున్నారు.
నిన్న వచ్చిన రెప్పల్ డప్పుల్ లో మాములు మాస్ బీట్స్ లేవు. హుషారెత్తించే వాయిద్యాలతో, విజిల్స్ వేయించే కంపోజింగ్ తో మంచి హుషారుగా సాగింది. ఈ క్రెడిట్ దర్శకుడు హరీష్ శంకర్ కే దక్కాలి. ఈ కాంబో కొత్త కాదు. గతంలో గద్దలకొండ గణేష్ కు ఇదే తరహా అవుట్ ఫుట్ తో వరుణ్ తేజ్ కో హిట్ ఇచ్చారు. అది కూడా రీమేకే కావడం గమనించాల్సిన విషయం. కానీ మిస్టర్ బచ్చన్ ప్రాథమికంగా కమర్షియల్ సబ్జెక్టు కాదు. రవితేజ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ చాలా మార్పులు చేసి మసాలాలు జోడించారు. లేదంటే ప్రాజెక్టుకి ఇంత క్రేజ్ వచ్చేది కాదు. అంచనాలు పెరిగేవి కాదు.
నిజానికి కల్కి 2898 ఏడికి ముందు తీసుకున్నది మిక్కీ జె మేయర్ నే. కానీ ఏవో తెరవెనుక కారణాల వల్ల ఆ స్థానంలో సంతోష్ నారాయణన్ వచ్చి చేరాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కనక హిట్ అయితే కెరీర్ మరోసారి ఊపందుకుంటుంది. తమన్, దేవిశ్రీ ప్రసాద్ లు బిజీగా ఉండటంతో టయర్ 2 హీరోలకు మ్యూజిక్ డైరెక్టర్లను సెట్ చేసుకోవడం సవాల్ గా మారింది. అందుకే కోలీవుడ్ నుంచి అనిరుధ్, యువన్, హారిస్ జైరాజ్, ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తోంది. ముందు నుంచి తెలుగు సినిమాతో ప్రయాణం చేస్తున్న మిక్కీ జె మేయర్ లాంటి వాళ్లకు మరిన్ని బ్రేక్స్ దక్కాలి.
This post was last modified on July 26, 2024 9:12 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…