దర్శకుడు పూరి జగన్నాధ్ వారసుడు ఆకాష్ పూరి ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఆకాష్ జగన్నాధ్ గా పేరు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తండ్రి పేరులో మొదటి సగం బదులు సెకండాఫ్ పెట్టుకోవాలన్న నిర్ణయం బాగానే ఉంది. బహుశా ఎవరైనా పండితులో లేక జ్యోతిష్యులో చెప్పారేమో. ఇక అసలు టాస్క్ ముందుంది. పూరి ఎంత గొప్ప దర్శకుడైనా తమ్ముడు సాయిరామ్ శంకర్, కొడుకు ఆకాష్ లతోనే సినిమాలు తీయాలనే కాన్సెప్ట్ తో ఎప్పుడూ పని చేయలేదు. ఆ మాటకొస్తే స్వంతంగా ఎదగాలనే ఉద్దేశంతో కెరీర్ ప్లానింగ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా వచ్చారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ప్లానింగ్ విషయంలో ఆకాష్ జగన్నాధ్ తడబాటు వల్ల వరస ఫెయిల్యూర్స్ పలకరించాయి. లవ్ రొమాన్స్ జానర్ లో రొమాంటిక్, మాస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చోర్ బజార్ ఇవేవి కనీస స్థాయిలో వర్కౌట్ కాలేదు. అంతకు ముందు స్వంతంగా నాన్నే తీసిన మెహబూబా సైతం డిజాస్టర్ బాటే పట్టింది. దీంతో ఎన్ని కథలు, దర్శకులు వస్తున్నా సబ్జెక్టు సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టడంతో ఇప్పటిదాకా కొత్త మూవీ మొదలుకానే లేదు. బాబాయ్ లాగా కాకుండా తనదైన ముద్ర వేయాలనేది ఆకాష్ జగన్నాధ్ లక్ష్యం. కానీ ఒక విషయం మర్చిపోకూడదు.
ఇది పోటీ ప్రపంచం. నెమ్మదిగా నడిస్తే పక్కనవాళ్లు పరుగులు పెట్టి గమ్యం చేరుకుంటారు. ఒక పెద్ద స్టార్ స్టేటస్ వచ్చాక గ్యాప్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ అసలు సెటిలే కాకుండా నిదానమే ప్రధానం అంటే కష్టం. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేసుకుంటూ పోవాలి. ప్రతి ఫలితం మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అన్నింటికి ప్రిపేర వ్వాలి. స్క్రిప్టుల ఎంపికలో జాగ్రత్త అవసరమే కానీ అది మరీ ఆలస్యం జరిగేలా ఉండకూడదు. దర్శకుల వారసులు చాలా అరుదుగా హీరోలుగా సక్సెసవుతారన్న మాటని బ్రేక్ చేయడానికైనా ఆకాష్ స్పీడ్ పెంచాల్సిందే.
This post was last modified on July 26, 2024 2:35 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…