కొన్ని సందర్భాల్లో విజయ్ దేవరకొండకు సంబంధించిన విషయాల్లో అనసూయ స్పందించిన విధానం పలు మార్లు హాట్ టాపిక్ గా మారడం అభిమానులు మర్చిపోలేరు.
అర్జున్ రెడ్డి టైంలో, ఆ తర్వాత ఖుషి రిలీజప్పుడు పేరుకి ముందు ‘ది’ అని రౌడీ హీరో పెట్టుకోవడం గురించి ఆమె వేసిన పంచులు పెద్ద చర్చకే దారి తీశాయి. ఆ కాంట్రావర్సీ తర్వాత అందరూ మర్చిపోయినా ఇవాళ మరోసారి వెలుగులోకి వచ్చింది. అనసూయ ప్రధాన పాత్ర పోషించిన సింబా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన మీడియా చిట్ ఛాట్ లో ఈ ప్రస్తావన జరిగింది. దానికి లీడ్ కూడా ట్రైలర్ లోనే ఉంది.
ఒక సన్నివేశంలో అనసూయను ఉద్దేశించి ఒక పాత్ర నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు రావాలని కోరుకుంటున్నానని ఒక డైలాగు చెబుతాడు. దానికామె నవ్వుతుంది కూడా.
ఆ అంశాన్నే ఉద్దేశించి ఎదురైన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ ఎవరైనా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తాయని, మీ అందరికీ ఎందుకు తప్పనిపించలేదని రివర్స్ లో మీడియాని అడగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవతలి వ్యక్తిని అడగకపోవడం మీదే తప్పని ఉల్టా చోర్ అంటూ ఒకనానుడి వినిపించి కౌంటర్ వేసింది.
ఎవరి మీద ద్వేషం లేదని చెబుతున్న అనసూయ అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట తరహాలో దాటవేయకుండా తన స్టాండ్ మీదే ఉండటం గమనార్హం. చాలా గ్యాప్ తర్వాత ఆమె ఫుల్ లెన్త్ రోల్ చేసిన సినిమా సింబా.
పర్యావరణానికి హానీ కలిగించే కార్పొరేట్ శక్తుల మీద యుద్ధం చేసే స్కూల్ టీచర్ గా చాలా పవర్ ఫుల్ పాత్రనే డిజైన్ చేశాడు దర్శకుడు. జగపతిబాబు మరో కీ రోల్ చేయగా గౌతమి, కౌసల్య, కబీర్ సింగ్, అనీష్ కురువిల్లా, దివి, వశిష్ట సింహ తదితరులతో క్యాస్టింగ్ గట్రా భారీగానే ఉంది. మురళి మనోహర్ దర్శకత్వం వహించగా ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
This post was last modified on July 24, 2024 5:00 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…