మాములుగా ఒక రీమేక్ అందులోనూ మూడు నాలుగేళ్ల పాత సినిమాని ఇంకో భాషలో తీస్తున్నప్పుడు క్రేజ్ కొంచెం తగ్గుతుంది. అందుకే విడుదలకు ముందు అజ్ఞాతవాసి తెచ్చుకున్న విపరీతమైన క్రేజ్ ని ఆ స్థాయిలో వకీల్ సాబ్, బ్రో లాంటివి చూపించలేకపోయాయి. వాల్తేరు వీరయ్య మీదున్న హైప్ గాడ్ ఫాదర్ కి కనిపించలేదు. ఇది సహజం. రవితేజ మిస్టర్ బచ్చన్ కు ఇలాగే జరుగుతుందని ట్రేడ్ భావించింది. అజయ్ దేవగన్ హీరోగా 2018లో రైడ్ వచ్చింది. అంటే ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పట్లో ఘన విజయం సాధించిన మూవీని హిందీ వచ్చిన తెలుగు జనాలు దాదాపుగా చూసేశారు.
అందుకే తెలుగు రీమేక్ మిస్టర్ బచ్చన్ ని ప్రకటించినప్పుడు రిస్క్ అనుకున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే రైడ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవు. హీరోయిజం, విలనిజం రెండు అండర్ కరెంట్ అనిపించేలా తలపడతాయి తప్పించి మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉండవు. అందులోనూ ఇది వర్తమానంలో జరిగే కథ కాదు. నలభై సంవత్సరాల క్రితం ఒక పట్టణంలో జరిగిన ఇన్కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా తీసింది. అలాంటప్పుడు షుగర్ కోటింగ్ ఛాన్స్ తక్కువ. అయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్ధపడిందంటే దానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్ చేసిన కీలక మార్పులే.
ఇప్పటిదాకా వచ్చిన టీజర్, పాటల రూపంలో వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మాస్ కోరుకునే స్థాయిలో రవితేజ జగపతిబాబు మధ్య క్లాష్, కమర్షియల్ సాంగ్స్, ఫైట్స్, హీరోయిన్ భాగ్యశీ బోర్సే రొమాన్స్ అన్నీ పొందుపరిచారు. వీటి దెబ్బకే థియేట్రికల్ బిజినెస్ ముప్పై అయిదు నుంచి నలభై కోట్ల మధ్య జరగొచ్చని ట్రేడ్ టాక్. డబుల్ ఇస్మార్ట్ లాంటి పోటీ పెట్టుకుని కూడా మిస్టర్ బచ్చన్ ఇంత డిమాండ్ ఏర్పడటం చూస్తే బయ్యర్లకు కంటెంట్ మీద గట్టి నమ్మకమే కనిపిస్తోంది. డీల్స్ ఇంకా క్లోజ్ చేయలేదట. ట్రైలర్ వచ్చాక హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందని యూనిట్ నుంచి వస్తున్న టాక్.
This post was last modified on July 24, 2024 6:40 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…