భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ప్యాన్ ఇండియా సినిమాల మధ్య పోలిక రావడం సహజమే కానీ అది ముందుగా జరిగేది పాటల విషయంలోనే. కేవలం రెండు వారాల గ్యాప్ లో విడుదల కాబోతున్న చిత్రాలు దేవర, కంగువల గురించే ఈ ప్రస్తావన. ముందుగా ఒక విశేషం చెప్పుకోవాలి. తెలుగు దేవరకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పని చేస్తుంటే తమిళ కంగువకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కంపోజింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. రెండూ సీక్వెల్స్ ప్లాన్ చేసుకున్న గ్రాండియర్స్. రెండిటి ద్వారా బాలీవుడ్ విలన్లు బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ పరిచయమవుతున్నారు.
ఇక అసలు పాయింటుకొస్తే దేవర, కంగువల నుంచి చెరో లిరికల్ ఆడియో సాంగ్ రిలీజయ్యాయి. మొదటిది ఫియర్ పేరుతో మెల్లగా ఎక్కేసి ఇప్పుడు ఛార్ట్ బస్టర్ గా మారిపోయింది. వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన దక్కినా అనిరుధ్ మేజిక్ ని సంగీత ప్రియులు తర్వాత ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మోతెక్కిపోతోంది. నిన్న కంగువ నుంచి ఫైర్ సాంగ్ వచ్చింది. ఇది కూడా హీరో క్యారెక్టరైజేషన్ వర్ణిస్తూ సాగేదే. స్లో పాయిజన్ లా టిపికల్ దేవిశ్రీ ప్రసాద్ స్టయిల్ లో సాగుతూ అభిమానులకు టార్గెట్ చేసుకున్నట్టు అనిపించింది. అయితే ఏది బెస్ట్ అనే ప్రశ్నకు వద్దాం.
వ్యూస్ ప్రకారం తీర్పు ఇవ్వలేం కానీ క్యాచీ ట్యూన్, బీట్స్, ఎలివేషన్స్ పరంగా చూసుకుంటే దేవరదే ఒకింత పైచేయిగా అనిపిస్తోందని సంగీత ప్రియుల అభిప్రాయం. పాట ఏదైనా పదే పదే వినాలి అనిపించినప్పుడే సక్సెస్ కి మొదటి మెట్టు. సోషల్ మీడియాలో త్వరగా వైరలయ్యేంత రీచ్ తెచ్చుకోవడం రెండో మెట్టు. వీటిని దేవర సునాయాసంగా ఎక్కేసింది. మరి ఫైర్ అంతే స్థాయిలో పరుగులు పెడుతుందా లేదానేది చూడాలి. కల్కి 2898 ఏడి తర్వాత వెయ్యి కోట్ల గ్రాస్ సాధించే సత్తా ఉన్న సినిమాలుగా దేవర, కంగువ ఆయా హీరోల అభిమానులు అంచనాలు విపరీతంగా పెట్టేసుకున్నారు. చూడాలి మరి.
This post was last modified on July 24, 2024 2:19 pm
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…