Movie News

ఓంకార్ తమ్ముడు మళ్ళీ విభిన్నంగానే

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా తెరకు పరిచయమైన అశ్విన్ బాబు సినిమాలు చేయడం తగ్గించినా అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబలో డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పటికీ ప్రేక్షక ఆమోదం పొందలేదు. ప్రయత్నం పరంగా పేరైతే వచ్చింది కానీ కాన్సెప్ట్ హ్యాండిల్ చేసిన విధానంలో తడబాటం వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ఆగస్ట్ 1 రిలీజ్ కానుంది. ఇవాళ ట్రైలర్ ద్వారా మూవీలో ఏముందో చెప్పే ప్రయత్నం చేశారు.

ఇండియాని మ్యాప్ లో లేకుండా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న పాకిస్థాన్ దాని కోసం ప్రమాదకమైన శక్తులను రంగంలోకి దించుతుంది. దీని వల్ల అనూహ్య పరిస్థితుల్లో ఎందరో హత్యకు గురవుతారు. ఈ మిస్టరీని ఛేదించడం పోలీస్, సిబిఐకు అంతు చిక్కని సవాల్ గా మారుతుంది. బాధితులుగా మారిన వాళ్లలో ఓ యువకుడు(అశ్విన్ బాబు) ఉంటాడు. ప్రాణాలతో బయట పడి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలుసుకునేందుకు రంగంలో దిగుతాడు. అయితే కార్యసాధనను మానవశక్తితో పాటు దైవ సహాయం కూడా తోడ్పడుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే తెరమీద చూడాలి.

కాన్సెప్ట్ ఆసక్తికరంగానే అనిపిస్తోంది. మర్దర్ మిస్టరీ చుట్టూ అల్లినప్పటికీ దానికి శివుడుతో ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడో జై చిరంజీవలో విలన్ గా నటించాక మళ్ళీ కనిపించలేదు. మురళి శర్మ, బ్రహ్మజి, తులసి, హైపర్ ఆది ఇలా పెద్ద క్యాస్టింగ్ నే పెట్టుకున్నారు. వికాస్ బడిస నేపధ్య సంగీతం థీమ్ ని ఎలివేట్ చేసేలా ఉంది. కల్కి 2898 ఏడి తర్వాత భారతీయుడు 2, డార్లింగ్ నిరాశ పరిచిన నేపథ్యంలో ఆగస్ట్ లో శివమ్ భజే ఏమైనా బోణీ కొడుతుందేమో చూడాలి.

This post was last modified on July 23, 2024 1:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

10 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

11 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

12 hours ago