కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేసిన రేణుకస్వామి హత్య కేసులో జైల్లో విచారణ ఎదురుకుంటున్న దర్శన్ నెల రోజులకు పైగా ఊచలు లెక్కబెడుతూనే ఉన్నాడు. ఇంటి నుంచి ఆహరం తెప్పించడానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది. ఇంకో వైపు కారాగారం, ఆహరం ఇతని ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించాయని దర్శన్ తరఫున న్యాయవాది ఆక్రోశిస్తున్నారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ పరిస్థితి కూడా దీనికి బిన్నంగా ఏమి లేదు. స్వంత అభిమానిని పొట్టన పెట్టుకున్న పాపం ఈ జంటను తీవ్రంగా వెంటాడుతోంది.
ఇదిలా ఉండగా దర్శన్ తో కోట్లాది రూపాయల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు విపరీతమైన ఆందోళనకు గురవుతున్నారు. వాటిలో ప్రధానమైంది డెవిల్. గత నాలుగైదు నెలలుగా షూటింగ్ లో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద శాండల్ వుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇంకొంత భాగం పెండింగ్ ఉండగా దర్శన్ అరెస్ట్ కావడంతో అర్ధాంతరంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇతర ఆర్టిస్టుల డేట్లన్నీ గంగపాలయ్యాయి. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ వృథా చేశారు. మిలన్ ప్రకాష్ రూపొందిస్తున్న డెవిల్ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన కాటేరా తర్వాత మూవీ కావడంతో హైప్ ఎక్కువగా ఉంది.
గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు శిక్ష ఖరారయ్యాక పెరోల్ తీసుకుని బ్యాలన్స్ ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేశాడు. వాటిలో రామ్ చరణ్ జంజీర్ కూడా ఉంది. ఇప్పుడు దర్శన్ కూ అలాగే వెసులుబాటు రావాలని డెవిల్ నిర్మాత కోరుకుంటున్నాడు. ఛార్జ్ షీట్ సమర్పణ జరిగే వరకు ఏ కారణం చేతనూ దర్శన్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బెయిల్ లేదా పెరోల్ దొరికినా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలకు మాత్రమే అనుమతి వస్తుంది. మరి డెవిల్ అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి. ఈలోగా వడ్డీల భారం ప్రొడ్యూసర్ మోయక తప్పదు.
This post was last modified on July 22, 2024 5:57 pm
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…