Movie News

చరణ్ వస్తే ఖాళీ చేయక తప్పదుగా

మొత్తానికి ‘గేమ్ చేంజర్’ రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఈ సినిమా క్రిస్మస్‌కు రానుందని ‘రాయన్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ఐతే ఇంతకుముందు ఆయనే సెప్టెంబరు రిలీజ్ అని ఓ సందర్భంలో హామీ ఇచ్చాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడేమో క్రిస్మస్ అంటున్నాడు నమ్మొచ్చా అన్న సందేహాలు చరణ్ అభిమానుల్లో ఉన్నాయి. కానీ ఈ సీజన్ మిస్సయితే రిలీజ్ కోసం చాన్నాళ్లు ఎదురు చూడాలి.

క్రిస్మస్ మిస్సయితే తర్వాతి ఆప్షన్ సంక్రాంతే. కానీ అదే సీజన్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ రాబోతోంది. చిరు సినిమాకు చరణ్ చిత్రాన్ని పోటీగా పెట్టరు కాబట్టి సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశం లేదు. సంక్రాంతి మిస్సయితే వేసవి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్‌కు ఖాయం అనుకోవచ్చు.

ఐతే క్రిస్మస్‌కు ‘గేమ్ చేంజర్’ వస్తే ఆ పండక్కి షెడ్యూల్ అయిన వేరే తెలుగు చిత్రాలను ఖాళీ చేయక తప్పదు. ఆ టైంలో నితిన్ సినిమా ‘రాబిన్ హుడ్’తో పాటు నాగచైతన్య మూవీ ‘తండేల్’ షెడ్యూల్ చేశారు. ‘గేమ్ చేంజర్’ లాంటి ప్రెస్టీజియస్ మూవీకి పోటీగా అవి రాలేవు. కంటెంట్ మీద నమ్మకంతో వచ్చినా థియేటర్ల సమస్య తప్పదు. దిల్ రాజు కచ్చితంగా పోటీలో వేరే సినిమా లేకుండా చూసుకుంటాడు. అందుకోసం రాయబారమైనా నడుపుతాడు. బహుశా ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేస్తుండొచ్చు కూడా. కాబట్టి ‘గేమ్ చేంజర్’ క్రిస్మస్‌కు ఫిక్సయితే తండేల్, రాబిన్ హుడ్ చిత్రాలను పోటీ నుంచి తప్పించాల్సిందే.

‘తండేల్’ వేసవికి వాయిదా పడొచ్చని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. ‘రాబిన్ హుడ్’ను ముందుకు తేవడమో లేక ఫిబ్రవరికి వాయిదా వేయడమో చేయొచ్చు. క్రిస్మస్ కాదంటే డిసెంబరులో ఈ చిత్రాలకు ఖాళీలైతే లేనట్లే. ఎందుకంటే ఆ నెల ఆరంభంలో ‘పుష్ప-2’ రాబోతోంది. మంచు విష్ణు సినిమా ‘కన్నప్ప’ను కూడా అదే నెలలో రిలీజ్ చేయబోతున్నారు.

This post was last modified on July 22, 2024 3:17 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago