తమిళంలో మేటి నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. తనెంత గొప్ప నటుడో దేశమంతా చూసింది. అలాంటి నటుడికి తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరై ఉంటారు? ఇదెంతో ఆసక్తి రేకెత్తించే విషయం. దీనికి సమాధానంగా ధనుష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం విశేషం.
తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్.. ఈ ఈవెంట్ స్టేజ్ మీద కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తెలుగులో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే.. తనను వేరే హీరోల ఫ్యాన్స్ తిట్టుకోవద్దు అని ముందే చెప్పి.. “ఐ లవ్ సినిమా. బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్” అని ధనుష్ చెప్పగానే ఆడిటోరియం హోరెత్తిపోయింది. ధనుష్ మళ్లీ మాట్లాడ్డానికి గ్యాప్ ఇవ్వకుండా చాలాసేపు అభిమానులు అరుస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత మీరు తెలుగులో మల్టీస్టారర్ చేయాలని అనుకుంటే ఎవరితో చేస్తారు అంటూ యాంకర్ కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అని పేర్లు చెప్పగా.. కొంచెం ఆలోచించి “తారక్” అని బదులిచ్చాడు ధనుష్. అప్పుడు కూడా ఆడిటోరియం హోరెత్తింది. మరోవైపు ‘రాయన్’లో భాగమైన ఓ నటి.. ధనుష్‌ను ఆస్కార్ అవార్డుల గురించి అడిగింది. మీరు అకాడమీ అవార్డ్ ఎప్పుడు తీసుకొస్తారు అని అడగ్గా.. దాని గురించి తర్వాత నేను చేసే సినిమాలు జనాలకు నచ్చితే చాలు, ఈ సినిమాను ఆదరిస్తే అదే నాకు ఆస్కార్ అవార్డు అని తెలివిగా సమాధానం ఇచ్చాడు ధనుష్.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాయన్’లో తెలుగు నటుడు సందీప్ కిషన్‌తో పాటు దుషారా విజయన్, అపర్ణ బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
This post was last modified on July 22, 2024 10:50 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…