చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అన్నకు దీటైన స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో అన్నను మించిపోయాడు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. పవన్ డిప్యూటీ సీఎం అయిపోయాడు. నాలుగు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు మామూలు ఆనందంలో లేరు.
వారిలో ఎక్కువ ఎగ్జైట్ అవుతున్న వాళ్లలో నాగబాబు తనయురాలు నిహారిక కూడా ఒకరు. తన బాబాయి పొలిటికల్ జర్నీ గురించి.. ఆయనతో తనకున్న అనుబంధం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి నిహారిక చెప్పిన ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
“ఇప్పుడు రాజకీయంగానూ బాబాయి సూపర్ స్టార్. సినిమా స్టార్‌గా కంటే రాజకీయ నాయకుడిగానే ఆయన్ని ఎక్కువ ఇష్టపడతా. బాబాయి విజయం గురించి తెలియగానే మా అమ్మ చాలా ఎమోషనల్ అయింది. ఆమె ప్రచారానికి వెళ్లి రాష్ట్రంలో పరిస్థితులు చూసింది కాబట్టి ఆయన విజయాన్ని ఎక్కువగా కోరుకుంది. అనుకున్నది జరగడంతో చాలా ఉద్వేగానికి గురైంది. ఫలితాల రోజు మేమంతా టీవీ ముందే కూర్చున్నాం. ఫలితాలు వస్తున్నపుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.
బాబాయి ఉప ముఖ్యమంత్రి అయ్యారనే గర్వం కంటే ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఎక్కువ సంతోషం కలిగింది. ఆయన రాజకీయ ప్రసంగాలు విని చాలా మోటివేట్ అయ్యాను. ఆయన స్పీచ్ ఇచ్చే సమయంలో అక్కడే ఉంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నానో. బాబాయి నన్ను ఎప్పుడూ నిహా అనే పిలుస్తారు. నాపై ఆయనకు ఎప్పుడూ కోపం రాలేదు. నా ఫోన్లో ఆయన పేరు.. ‘కేకేకే’ అని ఉంటుంది. అంటే కొణిదెల కళ్యాణ్ కుమార్ అని అర్థం. ఆయన అసలు పేరు కళ్యాణ్ కుమార్ అని తెలిశాక అలా సేవ్ చేసుకున్నా” అని నిహారిక చెప్పింది.
This post was last modified on July 22, 2024 10:19 am
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…