కెరీర్ తొలి నాళ్లలో తన మీద పడ్డ ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఒకప్పుడు ప్లే బాయ్ అనే కాక చీటర్ అనే ట్యాగ్స్ కూడా వచ్చాయని.. ఇప్పటికీ తనను ఆ దృష్టిలో చూస్తున్నారని అతనన్నాడు. తన కెరీర్ తొలి నాళ్లలో ఎఫైర్ల గురించి తాజాగా ఒక పాడ్ కాస్ట్‌లో రణబీర్ మాట్లాడాడు.
“గతంలో నేను ఇద్దరు స్టార్ హీరోయిన్లలో డేటింగ్ చేశా. అప్పుడు నాకొచ్చిన ఇమేజే తర్వాత నా ఐడెంటిటీగా మారింది. కాసనోవో, చీటర్ లాంటి ట్యాగ్స్ వచ్చాయి. నా జీవితంలో చాలా భాగం ‘ఛీటర్’ అనే లేబుల్‌తోనే జీవించాను. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కొంతమంది నాకు ఆ ట్యాగ్ ఆపాదిస్తున్నారు” అని రణబీర్ చెప్పాడు.
కెరీర్ ఆరంభంలో రణబీర్ ఏ సినిమా చేసినా.. ఆ చిత్ర కథానాయికతో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చేవి. ఐతే వారిలో రణబీర్‌కు బాగా దగ్గరైన వారిగా పేరు తెచ్చుకున్నది దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌లే. దీపికతో రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు ఆమెను రణబీర్ పెళ్లాడతాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కత్రినాతో ప్రేమాయణం నడిపినపుడు.. ఇద్దరూ మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతాయనే చర్చ జరిగింది. కానీ ఆ రిలేషన్‌షిప్స్ నిలబడలేదు.
ఆ తర్వాత ఆలియా.. రణబీర్ జీవితంలోకి వచ్చింది. ఆమెకు రణబీర్ అంటే చాలా ఇష్టం అని.. ఆమెనే అతడికి ప్రపోజ్ చేసిందని.. తర్వాత అతనూ ఇష్టపడ్డాడని.. ఇరు కుటుంబాలకు అభ్యంతరం లేకపోవడంతో పెళ్లి జరిగిందని బాలీవుడ్లో డిస్కషన్లు నడిచాయి. ఐతే ఒకప్పుడు రణబీర్‌కు ప్లేబాయ్ ఇమేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ.. పెళ్లి తర్వాత అతణ్ని అభిమానులు ఆ కోణంలో చూడట్లేదు. గత ఏడాది ‘యానిమల్’తో భారీ విజయాన్నందుకున్న రణబీర్.. ప్రస్తుతం ‘రామాయణం’లో నటిస్తున్నాడు.
This post was last modified on July 21, 2024 6:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…