యువ కథానాయకుడు నాగశౌర్య కెరీర్ ఇప్పుడు ఏమంత బాగా లేదు. అతను నిఖార్సయిన హిట్ కొట్టి చాలా కాలమైంది. చివరగా ‘రంగబలి’ అనే డిజాస్టర్ మూవీతో పలకరించాడు శౌర్య. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాక మీడియాతో మాట్లాటే సమయంలో తన తీరు కొంత వివాదాస్పదమైంది. ఆ తర్వాత అతను కనిపించలేదు.
వరుసగా సినిమాలు ఫెయిలవుతుండడంతో కొత్త చిత్రం మొదలుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈలోపు హత్య కేసులో చిక్కుకున్న కన్నడ నటుడు దర్శన్‌కు మద్దతుగా పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. అలాంటి వాడికి మద్దతేంటి అంటూ అతణ్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు నాగశౌర్య కొత్త సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలోనే కాక ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
కొత్త సినిమా విషయంలో రకరకాల ఆప్షన్లు పరిశీలించి చివరికి అరుణాచలం అనే కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాడు శౌర్య. ఐతే ఈ సినిమా షూట్ రెండు వారాలు తిరక్కముందే ఆపేశారట.
ఓ ఎన్నారై నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాగా.. కొత్త వ్యక్తి కావడంతో దర్శకుడు మిగతా టీం షూటింగ్ మొదలవడానికి ముందే కథా చర్చలు, ప్రి ప్రొడక్షన్ పేరుతో బాగా ఖర్చు పెట్టించేశారట. షూటింగ్ మొదలయ్యాక కూడా ఖర్చు తడిసి మోపెడవుతోందట. అప్పుడే బడ్జెట్ రూ.10 కోట్లు దాటిపోవడంతో నిర్మాత కంగారెత్తిపోతున్నాడట.
నాగశౌర్య మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉండగా.. ఈ టైంలో పది పన్నెండు రోజుల షూట్‌కే పది కోట్లకు పైగా బడ్జెట్ అయిపోతే చివరికి ఎంత బడ్జెట్ అవుతుందో అంచనా వేసుకుని నిర్మాత భయపడి సినిమాను ఆపేశాడట. ఈ సినిమా తాను చేయనని.. అయిన ఖర్చు తనకు సెటిల్ చేసి వేరే నిర్మాతను చూసుకోవాలని కోరుతున్నాడట. అతను ఫిలిం ఛాంబర్ పెద్దలను ఆశ్రయిస్తున్నాడట. మరి ఈ గొడవ మధ్య ఆ సినిమా ఏమవుతుందో చూడాలి.
This post was last modified on July 21, 2024 9:46 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…