Movie News

చిరంజీవిని ఫిదా చేసిన వశిష్ట ప్లానింగ్

వందల కోట్ల బడ్జెట్ తో ఫాంటసీ సినిమా అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు దర్శకుడి మీద చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. ఊహించని విధంగా వచ్చే బడ్జెట్ అడ్డంకులు, ఆర్టిస్టుల కాల్ షీట్లు, విఎఫెక్స్ కంపెనీల ఆలస్యాలు ఒకటా రెండా రాసుకుంటూ పోతే చాంతాండంత లిస్టు అవుతుంది. కానీ వశిష్ట పక్కా ప్లానింగ్ తో విశ్వంభర లాంటి గ్రాండియర్ ని పూర్తి చేసే దిశగా పరుగులు పెట్టడం చిరంజీవిని ఫిదా చేసినట్టు యూనిట్ టాక్. మూడు పాటలతో సహా దాదాపు టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ చేసి ఇంట్రో సాంగ్ తో పాటు క్లైమాక్స్ భాగాన్ని మాత్రం త్వరలోనే తీయబోతున్నారు.

మాములుగా అయితే యువి సంస్థలో ఏదీ ముందు అనుకున్న రీతిలో జరగదనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలకు ఇది ఋజువయ్యింది కూడా. విశ్వంభరకూ అదే రిపీట్ అవుతుందని అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా వసిష్ఠ వేసుకున్న షెడ్యూలింగ్ మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆస్కార్ విజేత కీరవాణితో సాంగ్స్ చేయించుకోవడంతో మొదలుపెట్టి త్రిష లాంటి బిజీ ఆర్టిస్టులతో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ బ్రేక్ రాకుండా చేసుకున్న వైనం బడ్జెట్ ని కూడా తగ్గిస్తుంది. అసలైన సవాల్ పోస్ట్ ప్రొడక్షన్ రూపంలో ఈ నాలుగైదు నెలల్లో ఎదురు కానుంది.

2025 జనవరి 10 విడుదలని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ పక్కాగా ఉంటుందని టీమ్ నుంచి అందుతున్న సమాచారం. ఒక లక్ష్యం కోసం ఎన్నో లోకాల్లో సాహస యాత్ర చేసే భీమవరం దొరబాబుగా చిరు పాత్ర ఇందులో మంచి మాస్ గా ఉంటుందని ఆల్రెడీ టాక్ ఉంది. అంజి తర్వాత మళ్ళీ ఈ జానర్ ని టచ్ చేయని మెగాస్టార్ ని తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జై టింగ్ గా ఉన్నారు. భోళా శంకర్ తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో విశ్వంభర సాలిడ్ కంబ్యాక్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on July 19, 2024 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కియారా… బేబీ బంప్‌తో మెగా గ్లామర్

కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…

48 minutes ago

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…

3 hours ago

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…

5 hours ago

తారక్ పుట్టిన రోజు.. డబుల్ ధమాకా?

మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…

12 hours ago

2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…

12 hours ago

యుద్ధ స‌న్న‌ద్ధం:  రాష్ట్రాల‌కు కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు

భార‌త్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు ఏ క్ష‌ణ‌మైనా యుద్ధానికి దారితీయొచ్చ‌ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు చెబుతు న్న స‌మ‌యంలో…

12 hours ago