గత కొన్ని వారాలుగా టాలీవుడ్లో ‘కల్కి 2898 ఏడీ’ తప్ప వేరే సినిమా పేరు వినిపించడం లేదు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కాగా.. అంతకు కొన్ని రోజుల ముందు నుంచే కల్కి ఫీవర్ మొదలైపోయింది. ఇక రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే.
‘కల్కి’ వస్తోందని ముందు, వెనుక వారాల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయలేదు. ఈ నెల 12న ‘భారతీయుడు-2’ మంచి అంచనాల మధ్యే విడుదలైనప్పటికీ అది అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమవడంతో మళ్లీ ‘కల్కి’నే బాక్సాఫీస్ దగ్గర లీడ్ తీసుకుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే.. తెలుగు నుంచి కొన్ని చిన్న చిత్రాలు రిలీజవుతున్నాయి. కానీ అవి ‘కల్కి’ జోరును ఏమాత్రం ఆపుతాయో అన్నది సందేహంగానే ఉంది.
ఈ వారం కొత్త చిత్రాల్లో ముందు చెప్పుకోవాల్సింది.. ‘డార్లింగ్’ గురించే. కమెడియన్‌గా పరిచయమై ఆ రోల్సే చాలా వరకు చేస్తూ వచ్చి.. ఆ తర్వాత మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు ప్రియదర్శి. అతను లీడ్ రోల్‌లో, తనకు జోడీగా నభా నటేష్ నటించిన చిత్రమిది. కొత్త దర్శకుడు అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘హనుమాన్’ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొంచెం బజ్ అయితే క్రియేట్ అయింది ఈ చిత్రానికి. మరి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
దీంతో పాటు తమిళ నటుడు వినోద్ నటించిన ‘పేకమేడలు’ అనే ఇంట్రెస్టింగ్ మూవీ ఈ వారం థియేటర్లలోకి దిగుతోంది. దీనికి ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. స్పందన పర్వాలేదు. ఇంకా ‘ది బర్త్ డే బాయ్’ అని ఇంకేవో కొన్ని చిన్న సినిమాలు ఈ వారం రిలీజవుతున్నాయి. అవి పెద్దగా ప్రేక్షకుల దృష్టిలో పడుతున్నట్లు లేవు. మరి ఈ సినిమాల్లో ‘కల్కి’ జోరును తట్టుకుని నిలబడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి ఏవో చూడాలి. ఈ చిత్రాలకు టాక్ లేకుంటే మరో వీకెండ్ ‘కల్కి’ దూకుడే చూడొచ్చు.
This post was last modified on %s = human-readable time difference 10:31 am
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…