టాలీవుడ్లో రెండేళ్లుగా రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడిచిందో తెలిసిందే. ఈ ట్రెండు మొదలైందే మహేష్ బాబు సినిమా ‘పోకిరి’తో. రెండేళ్ల కిందట సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది. ఆ టైంలో రిలీజైన కొత్త చిత్రాలను మించి సందడి చేసింది. ఆ తర్వాత మరెన్నో పాత సినిమాలను ఆయా హీరోల అభిమానులు సెలబ్రేట్ చేశారు. జల్సా లాంటి సినిమాలకు వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్లే షాకైపోయారు. డబ్బింగ్ సినిమాల రీ రిలీజ్‌లకు కూడా షాకింగ్ రెస్పాన్స్ రావడం వేరే ఇండస్ట్రీల జనాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ఐతే ఏదైనా డోస్ ఎక్కువైతే మొహం మొత్తుతుంది అన్నట్లు.. ఈ మధ్య రీ రిలీజ్‌లను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఈ ట్రెండ్‌కు తెర పడ్డట్లే అనుకుంటున్న సమయంలో మళ్లీ ఓ పాత సినిమా బాక్సాఫీస్ దగ్గర హవా సాగించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ చిత్రమే.. మురారి.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి రీ రిలీజ్ అవుతోంది. సూపర్ స్టార్ కెరీర్లో ‘మురారి’ ఎంత ప్రత్యేకమైన చిత్రమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా మహేష్‌ను ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కించిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. అందులో పాటలు, సన్నివేశాలు ఇప్పుడు చూసిన ముచ్చటగొలుపుతాయి. ఈ సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో కొన్ని వారాల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది.
స్వయంగా దర్శకుడు కృష్ణవంశీ అభిమానులను ఎంగేజ్ చేస్తూ మురారి గురించి ముచ్చట్లు పెడుతున్నాడు ట్విట్టర్లో. ఆయనే దగ్గరుండి ఎడిటింగ్ కూడా చేశారు. మరోవైపు అభిమానులేమో.. ఇందులో హీరో హీరోయిన్ల పెళ్లి నేపథ్యంలో వెడ్డింగ్ కార్డ్ కూడా ప్రింట్ చేశారు. కొన్ని రోజులుగా మహేష్ అభిమానుల చర్చలన్నీ ‘మురారి’ 4కే మీదే ఉన్నాయి. రీ రిలీజ్ సంబరాలకు పెద్ద ఎత్తునే ప్రిపేరవుతున్నట్లున్నారు. చూస్తుంటే ఆగస్టు 9న మురారి థియేటర్లలో మోత మోగించేలాగే కనిపిస్తోంది.
This post was last modified on July 19, 2024 10:30 am
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…