Movie News

చిన్న సినిమాల పోటీలో డార్లింగ్ డామినేషన్

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో డార్లింగ్ ఒక్కటే చెప్పుకోదగినది. ప్రియదర్శి, నభ నటేష్ జంటగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ని హనుమాన్ నిర్మించిన ప్రైమ్ షో సంస్థ అందిస్తోంది. ఒక రోజు ముందే పలు చోట్ల ప్రీమియర్లు వేసేందుకు సిద్ధపడటం చూస్తే కంటెంట్ మీద మాములు నమ్మకం కనిపించడం లేదు. నాని అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ప్రేక్షకుల దృష్టి దీనివైపుకు మళ్లింది.

మాములుగా ఓపెనింగ్స్ ఫుల్ చేసే రేంజ్ ప్రియదర్శికి లేదు. కానీ టాక్ బాగా వస్తే జనాన్ని రప్పించవచ్చని బలగం నిరూపించింది కాబట్టి ఇది కూడా అదే తరహాలో హిట్టు కొడుతుందన్న నమ్మకం తనలో ఉంది.

ఎల్లుండి డార్లింగ్ కి చాలా సానుకూలంశాలు ఉన్నాయి. మొదటిది కల్కి2898 ఏడి సునామి తర్వాత బాక్సాఫీస్ కు ఏకంగా మూడు వారాల గ్యాప్ వచ్చేసింది. మధ్యలో రిలీజైన భారతీయుడు 2 అల్ట్రా డిజాస్టర్ కావడంతో గ్రౌండ్ ఖాళీ అయిపోయింది. ఇరవై రోజులు దాటుతున్నా కల్కి కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఇదే.

పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది కానీ కమల్ హాసన్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ నమోదైపోయింది. సో డార్లింగ్ కనక డీసెంట్ నుంచి చాలా బాగుందనే టాక్ వస్తే చాలు వసూళ్లు ఆశించవచ్చు. నిర్మాత నిరంజన్ రెడ్డి మంచి థియేటర్లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

రేపు హైదరాబాద్ తో పాటు పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్లు జరగబోతున్నాయి. వీటి టాక్ కీలకం కానుండటంతో కచ్చితంగా ఆది ఉపయోగపడుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. పోటీగా పేకమేడలు, ది బర్త్ డే బాయ్, జస్ట్ ఏ మినిట్, క్రైమ్ ఫైల్స్ లాంటివి విడుదలవుతున్నాయి కానీ ఉన్నంతలో బజ్ ఉన్నది డార్లింగ్ కే.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెండు మూడు సినిమాలు చేసి హెల్త్ ఇష్యూ వల్ల గ్యాప్ తీసుకున్న నభ నటేష్ ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అశ్విన్ రామ్ దర్శకత్వంలో భార్యకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటే ఏమవుతుందనే పాయింట్ తో డార్లింగ్ తీశారు.

This post was last modified on July 17, 2024 10:29 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

3 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

5 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago