నార్త్ నుంచి సౌత్ దాకా వసూళ్ల దుమ్ము దులుపుతున్న కల్కి 2898 ఏడి నిర్మాతగా అశ్వినీదత్ గారి ఆనందం మాములుగా లేదు. ఈ సంవత్సరం వైజయంతి బ్యానర్ కు 50వ వార్షికోత్సవం. ఈ సందర్భంలోనే చరిత్రలో చెప్పుకునే బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనందం ఆయన టీమ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని పంచుకునే క్రమంలో తమ సంస్థ ప్రయాణాన్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో పంచుకున్నారు ఆశ్వినిదత్. అందులో కల్కికి సంబంధించిన విశేషాలతో పాటు తన ప్రయాణంలో చూసిన కొన్ని అద్భుతమైన మైలురాళ్ల గురించి చెప్పారు. వాటిలో ఒకటి 1996లో రిలీజైన పెళ్లి సందడి.
కేవలం 1 కోటి 20 లక్షలతో తీసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 11 కోట్ల 30 లక్షలు వసూలు చేయడం ఎవర్ గ్రీన్ రికార్డు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అశ్వినిదత్, అల్లు అరవింద్ కలిసి ఒక చిన్న సినిమా చేద్దామనే ఉద్దేశంతో రాఘవేంద్రరావు గారిని కథ అడిగారు. సరిగ్గా అదే సమయంలో పెళ్లి సందడి చేతిలో ఉంచుకున్న దర్శకేంద్రులు అదే వినిపించడం, బడ్జెట్ తక్కువగా అనిపించడంతో పట్టాలు ఎక్కించడం జరిగిపోయాయి. ఎంఎం కీరవాణి ఇచ్చిన ఆణిముత్యాల్లాంటి పాటలతో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. చిన్న కేంద్రాల్లోనూ సిల్వర్ జూబ్లీ ఆడింది.
ఆ టైంలో హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లోనూ టికెట్ రేట్లు 5 నుంచి 30 రూపాయల లోపే ఉండేవి. ఆ ధరలతోనే 11 కోట్లకు పైగా వసూలు చేయడం మాములు విషయం కాదు. ఇప్పటి ధరల్లో లెక్కేసుకుంటే వందల కోట్లు తేలుతాయి. సరదాగా చేసిన చిన్న ప్రయత్నం ఇంత గొప్ప ఫలితాన్ని ఇవ్వడం అశ్వినిదత్, అల్లు అరవింద్ ఊహించలేదు. అది కూడా సంక్రాంతి బరిలో బలమైన పోటీని తట్టుకుని మరీ గెలవడం ఒక మధుర జ్ఞాపకం. కంటెంట్ ఈజ్ కింగ్ ఇప్పుడు అంటాం కానీ ఆ సత్యం ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే రుజువయ్యింది. దానికి సాక్ష్యమే పెళ్లి సందడి.
This post was last modified on July 17, 2024 3:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…