Movie News

ఆల్ ఈజ్ వెల్ అంటున్న నవీన్ పోలిశెట్టి

గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో సూపర్ హిట్ అందుకున్నాక ఏకంగా పది నెలలు గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ మధ్య కాలంలో మీడియాకు, అభిమానులకు అందుబాటులోకి రాలేదు. తన కొత్త సినిమా అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందిన మాటా నిజమే. దానికి చెక్ పెడుతూ నవీన్ పోలిశెట్టి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన ప్రస్తుత పరిస్థితి గురించి వివరణ ఇచ్చాడు. ఆ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో తన చేతి ఎముకలకు మల్టిఫుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా ఇంజురీ అయ్యింది. దీని వల్లే సుదీర్ఘమైన విశ్రాంతి అవసరమైంది.

డాక్టర్ల సలహాల మేరకు నవీన్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. వేగంగా సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ ఆరోగ్య రిత్యా నెలల తరబడి బ్రేక్ తీసుకోవాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇలా చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. త్వరలో చేయబోయే చిత్రాలు అత్యద్భుతంగా రూపొందేలా జాగ్రత్త వహిస్తున్నానని, వీలైనంత త్వరలో పూర్తిగా రికవర్ అయ్యాక క్రేజీ అప్డేట్స్ తో స్వయంగా ముందుకు వస్తానని చెప్పాడు. ఎప్పటి లాగే మీ ప్రేమను ఆశిస్తున్నానని చెబుతూ మీ జానేజిగర్ అంటూ సందేశాన్ని ముగించాడు. గాయాలతో ఉన్న ఫోటోని కూడా పోస్ట్ తో పాటు నవీన్ పోలిశెట్టి జోడించాడు.

మొత్తానికి సందేహాలకు చెక్ పెడుతూ నవీన్ పోలిశెట్టి ఇలా అఫీషియల్ గా స్పష్టత ఇవ్వడంతో అభిమానులు హమ్మయ్యా అనుకుంటున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇలా వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న టైంలో అమెరికాలో జరిగిన ప్రమాదం నవీన్ కు స్పీడ్ బ్రేకర్ లా మారింది. అయితే తను చెప్పిన దాన్ని బట్టి కథలు వినడం, స్క్రిప్ట్ లలో భాగం కావడం మాత్రం ఆగలేదని స్పష్టమవుతోంది. కోలుకున్నాక ఏ దర్శకుడు, ఏ నిర్మాత, ఎవరెవరితో చేతులు కలపబోతున్నాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

This post was last modified on July 17, 2024 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

19 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

1 hour ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

3 hours ago