ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన గడ్డంని ట్రిమ్ చేశారనే టాక్ ఒక్కసారిగా సోషల్ మీడియాని కుదిపేసింది. పుష్ప 2 ది రూల్ గెటప్ లో ఎంతో కీలకమైన భాగాన్ని బన్నీ ఎలా తీస్తాడనే ప్రశ్నతో అభిమానులు అయోమయానికి గురయ్యారు. దర్శకుడు సుకుమార్ తో ఏవో విభేదాలు రావడం వల్లే ఇలా చేశాడని, దీంతో మరోసారి షూటింగ్ కి బ్రేక్ తప్పదని, డిసెంబర్ 6 విడుదల కావడం అనుమానమనే తరహాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు బన్నీ గడ్డం తగ్గించిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఏది కొత్తదో ఏది పాతదో అర్థం కానీ కన్ఫ్యూజన్ సర్వత్రా నెలకొన్న మాట వాస్తవం.
భారీ అంచనాల మధ్య ఇప్పటికే కీలకమైన ఆగస్ట్ 15 డేట్ వదులుకుని బడ్జెట్ పరంగా నష్టపోయిన నిర్మాతలు తిరిగి డిసెంబర్ 6 వదులుకునేందుకు సిద్ధంగా లేరు. సుకుమార్, బన్నీలకు సైతం అది ఇష్టం లేదు. ఎందుకంటే అలాంటిదేమైనా జరిగితే 2025 సమ్మర్ దాకా ఛాన్స్ ఉండదు. సంక్రాంతి మొత్తం ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. బన్నీ, సుక్కు మధ్య విభేదాల ప్రచారానికి రెక్కలు రావడానికి కారణం ఇద్దరూ వేర్వేరుగా విదేశీ ట్రిప్పులు ప్లాన్ చేసుకోవడమే. అలిగి వెళ్లిపోయారని ఒకరు, లేదూ కీలక ఆర్టిస్టుల డేట్లు దొరకనందు వల్ల బ్రేక్ తీసుకున్నారని మరొకరు యూనిట్ నుంచి చెబుతున్న మాట.
నిజానిజాలు ఏమో కానీ వీలైనంత త్వరగా పుష్ప 2 ది రూల్ నుంచి ఒక అప్డేట్ వస్తే వీటికి చెక్ పెట్టొచ్చు. ఆల్రెడీ పుష్ప ఇంట్రో టీజర్, రెండు లిరికల్ ఆడియో సాంగ్స్ వదిలేశారు. ట్రైలర్ ఇంకా ప్లాన్ చేయలేదు. క్లైమాక్స్ తో కలిపి ఇంకో ముప్పై రోజుల షూటింగ్ బాలన్స్ ఉందంటున్నారు కాబట్టి చాలా వేగంగా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. మూడు యూనిట్లు పని చేస్తున్నాయని సమాచారం. వాయిదాల పర్వం వల్ల బన్నీ కొంత అసహనానికి గురయ్యి ఉండొచ్చు కానీ ఆర్య లేనిదే నేను లేనని ఇటీవలే సుకుమార్ మీద తన అభిమానాన్ని మరోసారి వ్యక్తపరిచిన అల్లు అర్జున్ కోరిమరీ గొడవ పెట్టుకునే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ మాట.
This post was last modified on July 17, 2024 11:27 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…