రఘువరన్ బిటెక్ నుంచి ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బ్లాక్ బస్టర్లు లేకపోయినా డీసెంట్ సక్సెస్ లతో మార్కెట్ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ మధ్య తిరు తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ ఫలితం అందుకుంది. హీరోగానే కాకుండా దర్శకుడిగానూ ధనుష్ లో టాలెంట్ ఉన్న విషయం అభిమానులకు తెలిసిందే. 2017లో పా పాండితో డైరెక్టర్ గా ఘనవిజయం అందుకున్నా ఆ తర్వాత మెగా ఫోన్ చేపట్టలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దర్శకుడి కుర్చీలో కూర్చున్నాడు. అదే రాయన్. జూలై 26న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ ని తీసుకొచ్చారు.
సౌమ్యుడిగా కనిపించే రాయన్(ధనుష్) కు ఇద్దరు తమ్ముళ్లు. కొన్ని సంఘటనల వల్ల నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. శత్రువు (ఎస్జె సూర్య) నుంచి ఎదురవుతున్న ముప్పును తప్పించుకోవడానికి కత్తి పడతాడు. రక్తపాతంలో తనవాళ్లనూ భాగం చేస్తాడు. వీధుల్లో పరిగెత్తడంతో మొదలైన వేట పోలీస్ స్టేషన్ మెట్ల దాకా వెళ్తుంది. అడవిలో ప్రమాదకరమైన జంతువు సింహంగా భావించే రాయన్ అసలు ప్రమాదం తోడేళ్ళ నుంచి ఉంటుందని తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని హింసను పెంచుతాడు. అసలు ఇతనెందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడమే స్టోరీ.
స్వీయ దర్శకత్వంలో ధనుష్ ఈ రాయన్ ని పూర్తి వయొలెంట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. విజువల్స్ అన్నీ చాలా డెప్త్ తో ఉన్నాయి. తన గెటప్ తో పాటు హింసని పతాక స్థాయిలో చూపిస్తూ డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ కి నచ్చేలా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతంతో పాటు ఎస్జె సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ పాత్రలు ఆసక్తిని పెంచుతున్నాయి. పుదుపేట్టై (తెలుగు ధూల్ పేట్) తర్వాత మళ్ళీ అంత ఇంటెన్స్ రివెంజ్ డ్రామాగా రూపొందిన రాయన్ ని సన్ పిక్చర్స్ నిర్మించింది. తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on July 16, 2024 7:14 pm
అన్ స్టాపబుల్ సీజన్ 4 మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే…
టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలన్న ఆశలు తారుమారయ్యాయి. సిడ్నీలో జరిగిన ఐదో టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు…
సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా…
ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి…
https://youtu.be/fNDRSver0uM?si=FuJxROyuCDfNq7jV వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ సంక్రాంతి పండక్కు డాకు మహారాజ్ గా వస్తున్నారు. కమర్షియల్ అంశాలతోనే ఎప్పుడూ…
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…