ఇండియన్-2.. కొన్ని వారాల ముందు వరకు పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా భావించిన సినిమా. కానీ రిలీజ్ టైంకి ఈ చిత్రానికి సొంత భాష తమిళ సహా ఎక్కడా పెద్దగా హైప్ కనిపించలేదు. అయినా సరే.. శంకర్, కమల్ హాసన్ లాంటి కాంబినేషన్లో వందల కోట్లు పెట్టి తీసిన సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని అనుకున్నారు ప్రేక్షకులు. ఆ నమ్మకంతోనే థియేటర్లకు వెళ్లిన వారికి చుక్కలు కనిపించాయి. కంటెంట్ లేకుండా ఊరికే సాగదీసి మూడు గంటల పాటు ప్రేక్షకులను విసిగించేశాడు శంకర్.
దీంతో తొలి రోజు ఉదయం నుంచే నెగెటివ్ టాక్ తప్పలేదు. ఆ ప్రభావం వసూళ్ల మీద కూడా బాగానే పడింది. వీకెండ్లోనే ఈ చిత్రం నిలబడలేకపోయింది. ఆదివారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ 30 శాతం లోపే ఉండడం ఇందుకు గమనార్హం. తమిళనాడు సహా ఎక్కడా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు.
వీకెండ్ అయ్యాక ‘ఇండియన్-2’ పరిస్థితి ఘోరంగా తయారైంది. మినిమం ఆక్యుపెన్సీలు లేక బాక్సాఫీస్ దగ్గర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది ఈ చిత్రం. వరల్డ్ వైడ్ సోమవారం అన్ని భాషల్లో కలిపి కూడా సినిమాకు పది కోట్ల గ్రాస్ రాని పరిస్థితి. తమిళనాడులో సోమవారం 2 కోట్ల గ్రాస్ కూడా వసూలు కాలేదు. ఆక్యుపెన్సీ కూడా 20 శాతం కూడా లేని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ‘ఇండియన్-2’ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ విడివిడిగా కోటి రూపాయల గ్రాస్ కూడా రాలేదు. వీకెండ్ తర్వాత తెలుగు ఆడియన్స్ పూర్తిగా ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు.
ఇక నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమాను థియేటర్లలో నడిపిస్తే షేర్ అంటూ ఏమీ వచ్చేలా లేదు. మెయింటైనెన్స్ ఖర్చులకు కూడా డబ్బులు రాని పరిస్థితి. విదేశాల్లో కూడా ‘ఇండియన్-2’ పరిస్థితి ఘోరంగానే ఉంది. మొత్తంగా చూస్తే ‘ఇండియన్-2’ను ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారని, ఇది ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలవబోతోందని స్పష్టమవుతోంది.
This post was last modified on July 16, 2024 10:37 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…