హీరో కావడానికి ముందు.. ఆ తర్వాత కూడా రామ్ చరణ్ లుక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే వయసు పెరిగేకొద్దీ అతడి లుక్ మారుతూ వచ్చింది. అలాగే ఎలాంటి లుక్‌లో ఉంటే అత్యుత్తమంగా కనిపిస్తానో చరణ్ కూడా అర్థం చేసుకున్నట్లున్నాడు. స్టైలిస్టుల సాయంతో తెచ్చుకున్న మేకోవర్ చరణ్‌ను బెస్ట్ లుక్‌లోకి మార్చింది. ధృవ, రంగస్థలం సినిమాల్లో అతడి లుక్ అదిరిపోయిందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం ఇంకా మంచి లుక్‌లోకి మారాడు చరణ్. ఆ మధ్య వచ్చిన రామరాజు టీజర్లో చరణ్ ఎంత బాగా కనిపించాడో తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన లుక్‌లో చరణ్ ఎప్పుడు కనిపించినా అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.
తాజాగా చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన లేటెస్ట్ లుక్‌తో ఒక ఫొటో పెట్టాడు. దానికి రామరాజు పాత్ర కోసం పెంచిన కోర మీసంతో పాటు గడ్డం కూడా పెంచి షార్ప్‌గా చూస్తున్న ఫొటో అది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉండటం కూడా ఈ ఫొటోకు ప్రత్యేకత తీసుకొచ్చింది. చూడగానే వావ్ అనిపించేలా ఉన్న ఈ ఫొటో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ట్విట్టర్లోకి కూడా వచ్చి హల్‌చల్ చేసింది. ఈ పొటోకు.. Be the best possible version of urself అని క్యాప్షన్ కూడా జోడించాడు చరణ్. ఫొటోకు తగ్గ క్యాప్షన్‌లాగే అనిపించిందది. లుక్ పరంగా చరణ్‌కిది బెస్ట్ పాజిబుల్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఈ కిరాక్ లుక్‌తో సినిమాలో చరణ్ ఇంకెంతగా మెప్పిస్తాడో అని మెగా అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates