Movie News

మురారి జ్ఞాపకాలను తవ్వబోతున్నారు

పరిశ్రమకు పరిచయమయ్యింది రాజకుమారుడుతో అయినా మహేష్ బాబులోని పూర్తి పెర్ఫార్మర్ బయటికి వచ్చింది మాత్రం మురారిలోనే. దైవ బలాన్ని కుటుంబ అనుబంధాలకు జోడించి కాస్త కమర్షియల్ టచ్ తో మర్చిపోలేని మ్యూజికల్ జర్నీగా మార్చిన దర్శకుడు కృష్ణవంశీకి ఇది కెరీర్ బెస్టని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం 2001లో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. విడుదలైన మొదట్లో మూడు గంటలకు పైగా ఉన్న నిడివి మీద అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు నిరసన ప్రకటించడం లాంటి సంఘటనలు జరిగాయి.

ఈ కల్ట్ క్లాసిక్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజైన ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. సరికొత్త టెక్నాలజీతో 4కెలోకి మార్చి డాల్బీ సౌండ్ తో కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. ఇప్పటి యంగ్ జనరేషన్ లో మహేష్ బాబు అభిమానులు చాలా మందికి మురారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ లేదు. కేవలం టీవీ లేదా ఆన్ లైన్ చూడటం ద్వారా ఎంజాయ్ చేయడం తప్పించి పెద్ద తెరపై దాని వల్ల వచ్చే అనుభూతి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి కమర్షియల్ మసాలాలు లేని మురారి వాళ్ళను టైం మెషీన్ లో తీసుకెళ్లి ఆ జ్ఞాపకాలను పునఃసృష్టిస్తుంది.

ముఖ్యంగా మణిశర్మ సంగీతం దన్నుగా నిలిచిన మురారిలో సోనాలి బెంద్రే గ్లామర్, లక్ష్మి, సత్యనారాయణ, గొల్లపూడి లాంటి సీనియర్ల అద్భుతమైన నటన, బామ్మా మనవడి సెంటిమెంట్ వెరసి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఇందులో ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయకపోయినా మురారి నిర్మాతకు, బయ్యర్లకు నష్టాలు తెచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ లో సిల్వర్ జూబ్లీ ఆడిన ఘనత దక్కించుకుంది. నిజానికి మొదటి ఆప్షన్ గా ఖలేజా అనుకున్నారు కానీ దానికేవో లీగల్ సమస్యలు ఉండటంతో ఆ ఛాన్స్ మురారికి దక్కింది. సో ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది.

This post was last modified on July 15, 2024 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

7 minutes ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

21 minutes ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

1 hour ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

2 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

2 hours ago

జగన్ మారిపోయినట్టేనా

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…

5 hours ago